‘Anya’s Tutorial: ‘అన్య’స్ ట్యూటోరియల్’ టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్

ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో హారర్ వెబ్ సిరీస్ 'అన్య'స్ ట్యూటోరియల్' టీజర్‌ను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన ఈ వెబ్ సిరీస్ తమిళ, తెలుగు భాషల్లో లాంచ్ అవుతుంది.

‘Anya’s Tutorial: ‘అన్య’స్ ట్యూటోరియల్’ టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్

Anyas Tutrial

‘Anya’s Tutorial: ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో హారర్ వెబ్ సిరీస్ ‘అన్య’స్ ట్యూటోరియల్’ టీజర్‌ను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన ఈ వెబ్ సిరీస్ తమిళ, తెలుగు భాషల్లో లాంచ్ అవుతుంది. ఇందులో రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్‌ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది.

టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. “అన్య’స్ ట్యూటోరియల్ టీజర్ చాలా ఆసక్తభరితంగా తెరకెక్కించారు. ఈ టీజర్ లాంచ్ చేయడం తనకు సంతోషంగా అనిపించిందని, టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పారు ప్రభాస్.

https://fb.watch/dy_MnVIpVj/

ప్రపంచమంతా ఇప్పుడు డిజిటిల్ దిశగా అడుగులు వేస్తంది. అదే డిజిటల్ రంగం అందరిని భయపెడుతుందంటే.. అదే ‘అన్య’స్ ట్యూటోరియల్.

ఇక కథ విషయానికొస్తే.. అన్య(నివేదితా సతీశ్) ఒక సోషల్ ఇన్ఫూయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. రెజీనా కెసాండ్రా (మధు)కు ఆమె చెల్లి ప్రొఫెషన్ అంటే ఇష్టం ఉండదు. కానీ, ఒకరోజు అంతా మారిపోతుంది. సైబర్ ప్రపంచమంతా భయపడుతుంది. అలా ఏం జరిగింది.. అని తెలుసుకోవాలంటే ఆర్కా మీడియా వారి ‘అన్య’స్ ట్యూటోరియల్ చూడాల్సిందే.

ప్రేక్షకుల కోసం ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

 Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw