APSFL : కొత్త మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో.. ఇంటిలోనే చూసేలా ఏపీ ప్రభుత్వం కొత్త పథకం..

థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో ఏకంగా ఇంటిలో కూర్చొని చూసేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విశాఖపట్నంలో జూన్‌ 2న ఈ కార్యక్రమాన్ని..

APSFL – Tollywood : ఓటీటీ (OTT) కల్చర్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులు ఇంటిలో కూర్చొనే సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇక కరోనా తరువాత అయితే మూవీ సూపర్ హిట్ అని టాక్ వినిపిస్తే తప్ప థియేటర్స్ కి వెళ్లే ఆలోచన చేయడం లేదు ఆడియన్స్. దీంతో థియేటర్ వ్యవస్థ సమస్యల్లో పడిందని కొంత కాలంగా కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో ఏకంగా ఇంటిలో కూర్చొని చూసేలా ఏపీ ప్రభుత్వం (AP Government) అడుగులు వేస్తుంది.

Samantha : ఖుషి షూటింగ్.. టర్కీలో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంత

వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) సర్కార్ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (Andhra Pradesh State Fibernet Limited) ద్వారా ఎంటర్టైన్మెంట్ ని తక్కువ ధరకి ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 11,254 పంచాయతీల్లో 7600 పైగా గ్రామాలకు ఈ ఫైబర్‌ నెట్‌ కనెక్టివిటీని అందించారు. ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ ద్వారానే కొత్త సినిమాని విడుదల రోజే కేవలం రూ.99 కే ఇంటి వద్దనే కూర్చొని చూసేలా ఏపీ ప్రభుత్వం అవకాశం కలిపిస్తుంది. ఈ విషయాన్ని ఫైబర్‌ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి (Gowtham Reddy) వెల్లడించారు.

Kiara Advani : పెళ్లి తర్వాత కియారా అద్వానీ కొత్త కారు.. ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే..

నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా ఈ అవకాశం కల్పిస్తామంటూ గౌతమ్ రెడ్డి తెలియజేశారు. విశాఖపట్నంలో జూన్‌ 2న ఈ కార్యక్రమాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ (Gudivada Amarnath) చేతులు మీదుగా ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం నిర్మాతకు ఒకే అనుకుంటేనే ఫైబర్ నెట్ ద్వారా కొంత సినిమాని ఇంటి నుంచే చూడవచ్చు. 99తో సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న తరువాత 24 గంటల వరకు ఆ మూవీని చూసే అవకాశం ఉంటుంది. మరి ఈ నిర్ణయాన్ని నిర్మాతలు, థియేటర్ వ్యవస్థ ఆహ్వానిస్తుందా, లేదా? చూడాలి.

ట్రెండింగ్ వార్తలు