లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు

‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు.

  • Published By: madhu ,Published On : April 10, 2019 / 04:20 AM IST
లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు

‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు.

‘లక్ష్మీస్ NTR’ సినిమా ఏపీలో రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఎన్నికలు జరుగుతుండడంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమంటూ సెన్సార్ బోర్డ్ చెప్పేసింది. చిత్ర ప్రదర్శనను నిలువరిస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఏపీలో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది.

సినిమా రిలీజ్‌పై ఏపీ డిస్ట్రిబ్యూటర్లు కోర్టు మెట్లు ఎక్కారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఏప్రిల్ 10 బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయవాదుల సమక్షంలో తమ ఛాంబర్లో వీక్షిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. దీనితో బుధవారం సినిమాను చూసి నిర్ణయం వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది. 
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ

లక్ష్మీస్ NTR చిత్రాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలతో రూపొందింది ఈ సినిమా. చిత్ర ప్రకటన నుండి టీజర్స్ వరకు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇందులో ఏపీ సీఎం బాబుని నెగటివ్ షేడ్స్ చూపిస్తుండడంపై టీడీపీ లీడర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సినిమాను రిలీజ్ చేయవద్దని వారు డిమాండ్ చేశారు. తాజాగా ధర్మాసనం ఈ సినిమాను చూసి ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఇదిలా ఉంటే ఆర్జీవీ సినిమా రిలీజ్‌పై స్పందించారు. ట్విట్టర్‌లో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ వారం ఆంధ్రప్రదేశ్‌లో విడుదల అవుతుందని వెల్లడించారు. కానీ తేదీని మాత్రం వెల్లడించలేదు. ఎన్టీఆర్ పాత్రలో విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. 

Read Also : కమల్‌కు మద్దతివ్వడం లేదు – రజనీకాంత్