AP Online Cinema Tickets : ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తప్పేంటి?.. ఏపీ ప్రభుత్వంతో ఏకీభవించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంభందించిన జిఓ 142 కూడా.......

AP Online Cinema Tickets : ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తప్పేంటి?.. ఏపీ ప్రభుత్వంతో ఏకీభవించిన హైకోర్టు

Ap Online Tickets

AP Online Cinema Tickets :   కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంభందించిన జిఓ 142 కూడా పాస్ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకించారు. దీనిపై మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. నిన్న విచారణకి వచ్చిన ఈ కేసుపై హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తరపున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోంది, ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా బుక్‌ చేసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు.

Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి

దీనిపై స్పందించిన ధర్మాసనం ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయిస్తే పన్నుల ఎగవేతను అడ్డుకోవచ్చునని, ఇందుకోసమే ఆ విధానాన్ని తీసుకొచ్చిందని, దీనివల్ల ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లదని, ప్రజలకి ఇప్పుడు ఆన్లైన్ ని ఎలా ఉపయోగించాలో బాగా తెలుసని తేల్చి చెప్పింది. అలాగే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఏపీఎఫ్‌డీసీలకు నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది.