MAA : మొదలైన ఏపీ ‘మా’ ఎన్నికల సమరం

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌’ (మా ఏపీ) ఎన్నికల సమరం మొదలైంది. ఏపీ 'మా' ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌ రాజా........

MAA : మొదలైన ఏపీ ‘మా’ ఎన్నికల సమరం

Maa Ap

MAA :  గత కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ రేంజ్ లో రచ్చ సృష్టించాయో అందరికి తెలిసిందే. ‘మా’ ఎన్నికలు జనరల్ ఎన్నికల రేంజ్ లో జరిగాయి. టాలీవుడ్ రెండుగా విడిపోయి ఈ ఎన్నికల కోసం వాదులాడుకున్నాయి. ‘మా’ ఎన్నికల సమరం ముగిసిన తర్వాత కూడా ఆ ఎన్నికలు వివాదాలకు దారి తీశాయి. తాజాగా టాలీవుడ్ లో మరో ఎన్నికలకు తెర తీయనున్నారు.

Nithin : హీరో నితిన్ వైఫ్‌కి కరోనా.. దూరం దూరంగా బర్త్‌డే సెలబ్రేషన్స్

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌’ (మా ఏపీ) ఎన్నికల సమరం మొదలైంది. ఏపీ ‘మా’ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌ రాజా తెలిపారు. ఈ విషయంపై దిలీప్ రాజా మాట్లాడుతూ.. ”ప్రస్తుత కార్యవర్గంలో ప్రెసిడెంట్‌గా నటి కవిత, ప్రధాన కార్యదర్శిగా నరసింహ రాజు, కార్యదర్శిగా అన్నపూర్ణల పదవీ కాలం ముగిసింది. కరోనా వల్ల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయాం. 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ‘మా ఏపీ’లో సభ్యులుగా ఉన్నారు. 24 విభాగాల్లోని ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తును ‘మా ఏపీ’ కార్యాలయానికి పంపవచ్చు. ఎన్నికల తేదీని మార్చి 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారు’’ అని దిలీప్‌ రాజా తెలిపారు.