AR Murugadoss: తమిళ యంగ్ హీరోతో మురుగదాస్ మూవీ.. నిజమేనా..?

తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ తరువాత ఆ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఆయన తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా సూపర్ హిట్లుగా నిలవడంతో, మురుగదాస్ నెక్ట్స్ మూవీ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

AR Murugadoss: తమిళ యంగ్ హీరోతో మురుగదాస్ మూవీ.. నిజమేనా..?

AR Murugadoss Next Movie With This Young Hero

AR Murugadoss: తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ తరువాత ఆ రేంజ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఆయన తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా సూపర్ హిట్లుగా నిలవడంతో, మురుగదాస్ నెక్ట్స్ మూవీ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

రజినీ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్ రివ్యూ : దర్బార్ అదిరిపోయిందట

మురుగదాస్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే మురుగదాస్ తెరకెక్కించిన లాస్ట్ మూవీ ‘దర్బార్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత మురుగదాస్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయలేదు. దీంతో ఆయన తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో మురుగదాస్ ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్‌తో మురుగదాస్ ఓ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ హీరో కోసం ఓ మంచి కథను కూడా రెడీ చేశాడట ఈ డైరెక్టర్. మరి శివకార్తికేయన్ కోసం మురుగదాస్ ఎలాంటి సినిమాను పట్టుకొస్తాడా.. అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అనే ఆసక్తి కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది.