రూ. 3.47 కోట్ల పన్ను ఎగవేతపై AR రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు

  • Published By: sreehari ,Published On : September 11, 2020 / 05:24 PM IST
రూ. 3.47 కోట్ల పన్ను ఎగవేతపై AR రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు

స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన అప్పీల్ ఆధారంగా మద్రాస్ హైకోర్టు రెహమాన్‌కు నోటీసు జారీ చేసింది. జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ వి భవానీ సుబ్బరోయన్ల డివిజన్ బెంచ్ ఎఆర్ రెహమాన్‌కు నోటీసు పంపింది.



https://10tv.in/reason-for-historic-decline-in-gdp-is-gabbar-singh-tax-of-centre-rahul-gandhi/
పన్ను ఎగవేతపై మద్రాసు హైకోర్టును ఐటీ శాఖ అధికారులు ఆశ్రయించారు. ఇంగ్లండ్ కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి తీసుకున్న రూ.3.47 కోట్లకు ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ శాఖ పేర్కొంది. దీనిపై సమాధానం ఇవ్వాలని రెహమాన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.



ఎఆర్ రెహమాన్ తన వేతనాన్ని రూ .3.47 కోట్ల రూపాయలను తన ఛారిటబుల్ ట్రస్టుకు బదిలీ చేశారని ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు. అంతేకాక దీనిపై చెల్లించాల్సిన పన్ను కూడా ఎగవేసినట్లు ఐటి విభాగం అప్పీల్‌లో పేర్కొంది. 2011-12 సంవత్సరానికి రెహమాన్ పన్ను దాఖలు చేయడంలో ఐటి శాఖ వ్యత్యాసాలను గుర్తించింది. తుల మొబైల్స్ అనే యుకెకు చెందిన టెలికాం కంపెనీకి రింగ్‌టోన్లు కంపోజ్ చేసినందుకు రెహమాన్‌కు ఆ కంపెనీ భారీ మొత్తంలో ముట్టచెప్పింది.



2011లో జరిగిన ఈ మూడేళ్ల ఒప్పందంతో సంస్థ కోసం ప్రత్యేకమైన రింగ్‌టోన్‌లను కంపోజ్ చేశాడు రెహమాన్.. సంపాదన మీద వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ న్యాయవాది తెలిపారు. ఆదాయపు పన్ను మినహాయింపు తరువాత.. దానిని ఛారిటబుల్ ట్రస్ట్‌కు తరలించవచ్చునని వాదించారు.