బాఫ్తాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎ.ఆర్.రెహమాన్

10TV Telugu News

AR Rahman: మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సంగీత దర్శకులు ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. బ్రిటీష్ అకాడ‌మీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజ‌న్ ఆర్ట్స్(BAFTA) సంస్థ ఇండియ‌న్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడ‌ర్‌గా.. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ను నియ‌మించిన‌ట్లు ప్రకటించింది.

బాప్టా, నెట్‌ఫ్లిక్స్ స‌హాకారంతో భారతదేశంలోని గొప్ప క‌ళాకారుల‌ను గుర్తించ‌డానికి రెహమాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ సందర్భంగా రెహమాన్ స్పందిస్తూ.. ‘‘టెలివిజన్, స్పోర్ట్స్, సినిమా రంగాల్లో టాలెంట్ కలిగిన వారిని గుర్తించ‌డానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. భార‌త్‌లో అద్భుత‌మైన ప్ర‌తిభావంతుల‌ను ప్ర‌పంచ వేదిక‌పై నిల‌బెట్ట‌డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.

×