మొత్తం గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది: AR Rahman

మొత్తం గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది: AR Rahman

దిగ్గజ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్లు చేశారు. ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అందించే ఆయన.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘దిల్ బేచారా’ మూవీలో ఓ పాటకు కంపోజిషన్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత పాటకు వస్తున్న స్పందన చూసి రేడియో మిర్చి రెహమాన్ ను ఇంటర్వ్యూ చేసింది.

‘మంచి సినిమాలకు నేనెప్పుడూ నో చెప్పను. కానీ, కొన్ని అపార్థాలతో తప్పుడు ప్రచారం చేస్తుంది. ముఖేశ్ చాబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండ్రోజుల్లోనే ఆయనకు 4పాటలు ఇచ్చాను. అతను నాతో ఏం చెప్పాడంటే.. ‘సర్, నన్ను మీ దగ్గరకు చాలా మంది వెళ్లొద్దు.. వెళ్లొద్దు అని అన్నారు’ అని అన్నాడు. వారందరి కథలు విన్న తర్వాత కదా నేను నో చెప్పింది.

ఆయన చెప్పింది విన్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను. హిందీ సినిమాల్లో నాకు తక్కువ ఆఫర్లు ఎందుకొస్తున్నాయో తెలిసింది. మంచి సినిమాలు నా దగ్గరకు రాకపోవడానికి కారణం అర్థమైంది. నేను చీకటి సినిమాలు చేస్తున్నా. ఎందుకంటే పూర్తి గ్యాంగ్ అంతా నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాళ్లు హాని చేస్తున్నట్లు వారికి కూడా తెలియదు’ అని అన్నాడు.

ప్రజలు నా నుంచి స్టఫ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ, ఇంకో గ్యాంగ్ అలాంటివి జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇది బాగానే ఉంది. ఎందుకంటే నేను డిస్టినీని నమ్ముతా. ప్రతి విషయం దేవుడి నుంచే వస్తుందని నమ్ముతా. నా సినిమాలు ఎంచుకుంటా. ఇతర పనులు చూసుకుంటా. కానీ, నా దగ్గరకు వచ్చే వాళ్లందరికీ వెల్‌కమ్. మంచి సినిమాలు తీయండి’ అని రెహమాన్ అంటున్నారు.