AR Rahman: ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురికి సౌండ్ ఇంజినీర్‌తో నిశ్చితార్థం

మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహామన్ పెద్ద కూతురికి సౌండ్ ఇంజినీర్ రియాస్దీన్ షేక్ మొహమ్మద్ తో నిశ్చితార్థం జరిపించారు. వృత్తి రీత్యా ఆడియో ఇంజినీర్ అయిన రియాస్దీన్.. సింగర్ ఖతీజాలకు..

AR Rahman: మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహామన్ పెద్ద కూతురికి సౌండ్ ఇంజినీర్ రియాస్దీన్ షేక్ మొహమ్మద్ తో నిశ్చితార్థం జరిపించారు. వృత్తి రీత్యా ఆడియో ఇంజినీర్ అయిన రియాస్దీన్.. సింగర్ ఖతీజాలకు డిసెంబర్ 29న ఎంగేజ్మెంట్ జరిపించారు. ఈ విషయాన్ని ఖతీజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘దేవుడు ఆశీర్వాదాలతో నా ఎంగేజ్మెంట్ రియాస్దీన్ షేక్ మొహమ్మద్ తో జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. నా పుట్టినరోజైన డిసెంబర్ 29నే సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది’ అని పోస్టు పెట్టారు.

ఆమె పోస్టుకు బోలెడుమంది సెలబ్రిటీలు రెస్పాండ్ అయి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదే ఫొటోను షేర్ చేసిన ఏఆర్ రెహమాన్ తన అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నారు.

ఖతీజా రెహమాన్ తన తండ్రి కంపోజిషన్ లోనే ‘రోబో సినిమాలో ఓ మరమనిషి పాటతో అరంగ్రేటం చేశారు. లెజెండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాట పాడారు. శంకర్ డైరక్షన్ లో రజినీకాంత్ నటించిన సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ పాట పాడిన సమయంలో ఈమె వయస్సు 14ఏళ్లు మాత్రమే.

ఇది కూడా చదవండి.. నాడు నేరగాళ్ల అడ్డా.. ఇప్పుడు క్రీడాకారుల గడ్డ : ప్రధాని మోదీ

మార్చి 12, 1995న వివాహం చేసుకున్న ఏఆర్ రెహమాన్ కు ముగ్గురు పిల్లలు. ఖతీజా రెహమాన్, రహీమా రెహమాన్, అమీన్ రెహమాన్ లు ముగ్గురు మ్యూజిషియన్సే.

ట్రెండింగ్ వార్తలు