AR Rehman : ఏఆర్ రెహ‌మాన్ బతుకమ్మ శుభాకాంక్షలు

 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ ఇటీవల తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు సాంగ్ కంపోస్ చేశారు. తెలంగాణ జాగృతి తరపున కల్వకుంట్ల కవిత బతుకమ్మకు ఈ సారి ఏఆర్

10TV Telugu News

AR Rehman :  ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ ఇటీవల తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు సాంగ్ కంపోస్ చేశారు. తెలంగాణ జాగృతి తరపున కల్వకుంట్ల కవిత బతుకమ్మకు ఈ సారి ఏఆర్ రెహ‌మాన్ చే సాంగ్ ని కంపోజ్ చేపించింది. ఈ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ అందంగా చిత్రీకరించారు. నిన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతా మహిళలు ఆనందంగా బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నారు.

Janvi Kapoor : మరో బయోపిక్ లో శ్రీదేవి కూతురు

ఈ సందర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. అంద‌రినీ ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే పండుగ బ‌తుక‌మ్మ అని, తెలంగాణ ఆడ‌ప‌డుచులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని ఏఆర్ రెహ‌మాన్ ఆ ట్వీట్ లో తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ నుంచి ఈ ట్వీట్ కి మంచి స్పందన వస్తుంది.