అభిమానుల సమక్షంలో ‘అరవింద సమేత’ 1 ఇయర్ సెలబ్రేషన్స్

హైదరాబాద్ ఎన్టీఆర్ అభిమానులు.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో ‘అరవింద సమేత’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు..

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 09:59 AM IST
అభిమానుల సమక్షంలో ‘అరవింద సమేత’ 1 ఇయర్ సెలబ్రేషన్స్

హైదరాబాద్ ఎన్టీఆర్ అభిమానులు.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో ‘అరవింద సమేత’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’.. 2018 అక్టోబర్ 11న దసరా కానుకగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత విడుదలై 2019 అక్టోబర్ 11 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా తారక్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

హైదరాబాద్ ఎన్టీఆర్ అభిమానులు.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కార్యాలయంలో ‘అరవింద సమేత’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు త్రివిక్రమ్, పిడివి ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, విక్రమ్ సింహా (కూకట్‌పల్లి) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also : 30 ఏళ్ల ‘బాల గోపాలుడు’

హైదరాబాద్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షులు కుమార్ యాదవ్, నరసింహరావు, నందిపాటి మురళి అధ్యక్షతన జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో.. వారు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను దర్శకులు త్రివిక్రమ్ కట్ చేశారు. తమ హీరో కెరీర్‌లో ‘అరవింద సమేత’ వంటి మెమరబుల్ మూవీ ఇచ్చినందుకుగానూ దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు అభిమానులు..