Kamal Haasan : కమల్ హాసన్, మణిరత్నం సినిమాలో 7 హీరోలు నటించబోతున్నారా?

ప్రస్తుతం కమల్, శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. కమల్ 234వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో కమల్ తో పాటు వివిధ భాషలకు సంబంధించిన 7 హీరోలు నటించబోతున్నారు అని సమాచారం.

Kamal Haasan : కమల్ హాసన్, మణిరత్నం సినిమాలో 7 హీరోలు నటించబోతున్నారా?

Kamal Haasan

Kamal Haasan : లోక నాయకుడు కమల్ హాసన్.. విక్రమ్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. 2019 లోనే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అనేక కారణాలు వల్ల లేటు అవుతూ వచ్చింది. గత ఏడాది మళ్ళీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.

Kamal Haasan: ‘భారత్ జోడో యాత్ర’లో చేరనున్న కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర

శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ హీరో సుదీప్, మరో హీరో సిద్దార్ద్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబీ సింహ వంటి భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తరువాత కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. కమల్ 234వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో కమల్ తో పాటు వివిధ భాషలకు సంబంధించిన 7 హీరోలు నటించబోతున్నారు అని సమాచారం.

ఈ 7 హీరోల్లో ఒకరు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కమల్ అండ్ షారుఖ్ ‘హే రామ్’ అనే వివాదాస్పద సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కోసం చేతులు కలపబోతున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు పై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాను మణిరత్నం, కమలహాసన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. 1987లో వచ్చిన సూపర్ హిట్టు సినిమా ‘నాయకుడు’ తరువాత దాదాపు 35 ఏళ్ళ తరువాత కమల్, మణిరత్నం కలయికలో సినిమా వస్తుండడంతో.. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.