Bigg Boss 5: నన్ను వదిలేస్తున్నావా.. సిరికి బాయ్ ఫ్రెండ్ సూటి ప్రశ్న!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ సొంత కుటుంబ సభ్యులను పంపిన బిగ్ బాస్ వారి మధ్య ఎమోషనల్..

Bigg Boss 5: నన్ను వదిలేస్తున్నావా.. సిరికి బాయ్ ఫ్రెండ్ సూటి ప్రశ్న!

Bigg Boss 5 (1)

Bigg Boss 5: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ సొంత కుటుంబ సభ్యులను పంపిన బిగ్ బాస్ వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ తో కథ నడిపాడు. హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు రావడంతో హౌస్ అంతా ఎమోషనల్ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికి మొత్తం రెండు ఎపిసోడ్స్ ను ఈ ఎమోషనల్ సీన్స్ తోనే నడిపించేశారు. కాగా, ఇప్పుడు మరో ఎపిసోడ్ కూడా ఇదే ఎమోషన్ క్యారీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Bigg Boss 5: పింకీ ఔట్.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమేనా?

ఎందుకంటే.. రెండు రోజులు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపిన బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగ్ స్టేజి మీదకి అదే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కాస్త సందడి, మరికాస్త ఎమోషనల్ ఫీల్ తీసుకొచ్చాడు. ఇందులో భాగంగానే రవికోసం తల్లి, కాజల్‌ ఫ్రెండ్‌ సహా సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. షన్ను కోసం కూడా తన బ్రదర్ తో పాటు షన్ను ప్రేయసి దీప్తి కూడా వచ్చేసింది.

Katrina Kaif: క్యాట్-విక్కీ మ్యారేజ్ మిస్టరీ.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్!

అయితే, శ్రీహన్ స్టేజి మీదకి రాగానే సిరి తలదించుకుంది. హౌస్ లో ఓ గోడవైపు తల తిప్పేసుకున్న సిరి గుక్కపెట్టి ఏడ్చేసింది. ఎపిసోడ్ లో ఏమైందో ఏమో కానీ ప్రోమోలో మాత్రం నన్ను వదిలేస్తున్నావా సిరి అంటూ శ్రీహన్ ప్రశ్నించడంతో సిరి మరికాస్త దుఃఖంలోకి వెళ్ళింది. ఇక.. షన్ను కోసం తన ప్రేయసి దీప్తి సునయన కూడా వచ్చేసింది. షన్నును చూసి దీప్తి మిస్ యూ రా అంటే షన్ను ఎమోషనల్ అయ్యాడు. దీంతో దీప్తి పంది అంటూ షన్నును తిట్టేయడంతో ప్రోమో కట్ చేశారు. మరింతకీ ఏమైందో తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్స్ చూడాల్సిందే.