రేపు ఉదయం 7.11 కి డార్లింగ్ ఏం చెప్పబోతున్నాడు?.. వీడియో వైరల్..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 07:54 PM IST
రేపు ఉదయం 7.11 కి డార్లింగ్ ఏం చెప్పబోతున్నాడు?.. వీడియో వైరల్..

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మంగళవారం (ఆగస్టు 18)న ఏం అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు?.. అనే సందేహం సినీ మరియు మీడియా వర్గాలతోపాటు డార్లింగ్ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ప్రభాస్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో అందరిలోనూ ఉత్సుకత పెంచేసింది.



బాలీవుడ్ రైటర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఓం రౌత్, ప్రభాస్‌తో లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘Hey ప్రభాస్.. ఆర్ యు రెడీ ఫర్ టుమారో’’.. అని అడగ్గా.. డార్లింగ్ ‘ఆల్ ఎగ్జైటెడ్.. ఫింగర్స్ క్రాస్డ్’’ అంటూ తాను కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. ‘లెట్స్ డూ ఇట్’ అంటూ ఓం రౌత్ ఫినిషింగ్ ఇచ్చాడు.



ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమాల విషయానికివస్తే.. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్.. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సినిమా చేయనున్నాడు డార్లింగ్.



https://www.instagram.com/p/CD_jO3GJu_Q/?utm_source=ig_web_copy_link