Bigg Boss Nonstop: హాయ్‌ చెప్పడానికి బలుపేంటి.. హీరోపై అరియనా ఫైర్!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం రెండో వారం చివరికి చేరుకుంది. తొలి వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా సోమవారం రెండో వారం నామినేషన్స్ లో..

Bigg Boss Nonstop: హాయ్‌ చెప్పడానికి బలుపేంటి.. హీరోపై అరియనా ఫైర్!

Bigg Boss Nonstop

Bigg Boss Nonstop: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం రెండో వారం చివరికి చేరుకుంది. తొలి వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా సోమవారం రెండో వారం నామినేషన్స్ లో సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టాలు హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. వీరిలో శ్రీరాపాక లేదా మిత్ర శర్మలలో ఒకరు ఎలిమినేట్ అయ్యారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతుంది.

Bigg Boss Nonstop: ఎలిమినేషన్ నామినేషన్.. ఈ వారం లిస్టులో 12 మంది!

ఇదిలా ఉండగానే రెండో వారం వీకెండ్ కి గెస్ట్ అప్పియరెన్స్ తీసుకొచ్చాడు బిగ్ బాస్. స్టాండప్‌ రాహుల్‌ హీరోహీరోయిన్లు రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ హౌస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్లతో స్కిట్స్ చేయించారు. ఈ మేరకు ప్రోమోలు రిలీజ్‌ చేయగా.. అతిథులుగా వచ్చిన హీరోహీరోయిన్లను హౌస్‌మేట్స్‌ తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించి ఇంప్రెస్‌ చేశారు. అయితే, ఇదే ప్రోమోలలో అరియనాను రాజ్ తరుణ్ ను పట్టుకొని హౌస్ లోకి వచ్చాక హాయ్ చెప్పడానికి నీకేంటి అంత బలుపు అంటూ ఆర్గ్యు చేసింది. అరియనా మాటలకు హౌస్ లో మిగతా కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.

Bigg Boss OTT Telugu: కాలేజీలో ప్రేమ.. బిందు మాధవి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ

రాజ్‌తరుణ్‌ అనుభవించు రాజా సినిమాలో అరియానా కూడా నటించింది. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువుతోనే నీకు హాయ్‌ చెప్పడానికి బలుపేంటి అంటూ నిలదీసింది. రాగానే చెప్పాను కదా అని రాజ్‌తరుణ్‌ సమాధానం చెప్పినప్పటికీ అరియానా మాత్రం శాంతించలేదు. ఏంటి నీ ఫ్రెండ్‌ హాయ్‌ చెప్పట్లేదు అని చైతూ అప్పటినుంచి అంటున్నాడు అంటూ గరం అయింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి ఇది సీరియస్ కాకపోవచ్చు.. బిగ్ బాస్ ప్రోమోల కోసమే బిల్డప్ ఇచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.