Arjun Kalyan : బిగ్‌బాస్‌ కోసం సినిమా వదులుకున్న శ్రీసత్య.. శ్రీసత్య కోసం అన్ని వదులుకొని బిగ్‌బాస్‌‌కి వచ్చిన అర్జున్ కళ్యాణ్..

అర్జున్ బిగ్‌బాస్‌ స్టేజిపై మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్‌ రావడానికి మెయిన్ కారణం శ్రీసత్యనే. బిగ్‌బాస్‌ మొదలవ్వక ముందు శ్రీసత్యకి నేను ఒక సినిమా ఆఫర్ చేశాను. డేట్స్ లేవు, చెయ్యను అని చెప్పింది. ఎందుకు అని అడిగితే బిగ్‌బాస్‌ కి వెళ్తున్నాను...........

Arjun Kalyan : బిగ్‌బాస్‌ కోసం సినిమా వదులుకున్న శ్రీసత్య.. శ్రీసత్య కోసం అన్ని వదులుకొని బిగ్‌బాస్‌‌కి వచ్చిన అర్జున్ కళ్యాణ్..

Arjun Kalyan came to BiggBoss only for Sri satya

Arjun Kalyan :  బిగ్‌బాస్‌ సీజన్ 6 అప్పుడప్పుడు హీట్ గా, అప్పుడప్పుడు చప్పగా సాగిపోతుంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తయ్యాయి. హౌజ్ లో నుంచి ఏడో వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అర్జున్ కళ్యాణ్ సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నాడు. అయితే బిగ్‌బాస్‌ ఆఫర్ రావడంతో అంతా తను బిగ్‌బాస్‌ కి వచ్చాడనుకున్నారు.

కానీ ఈ వారం తను ఎలిమినేట్ అయ్యాక బిగ్‌బాస్‌ స్టేజి పైకి వచ్చి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడంతో శ్రీసత్య ఎమోషనల్ అయింది. శ్రీసత్య ఏడవడంతో అర్జున్ కళ్యాణ్ కూడా ఏడ్చాడు.

BiggBoss 6 Day 49 : బిగ్‌బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్.. ఏడ్చేసిన శ్రీసత్య..

అర్జున్ బిగ్‌బాస్‌ స్టేజిపై మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్‌ రావడానికి మెయిన్ కారణం శ్రీసత్యనే. బిగ్‌బాస్‌ మొదలవ్వక ముందు శ్రీసత్యకి నేను ఒక సినిమా ఆఫర్ చేశాను. డేట్స్ లేవు, చెయ్యను అని చెప్పింది. ఎందుకు అని అడిగితే బిగ్‌బాస్‌ కి వెళ్తున్నాను అని చెప్పింది. దీంతో నేను కూడా బిగ్‌బాస్‌ కి అప్లై చేయడంతో అదృష్టం బాగుంది వచ్చింది. నాకు బిగ్‌బాస్‌ ఆఫర్ రాగానే ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా మొదట శ్రీసత్యకే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనికి శ్రీసత్య స్పందిస్తూ అసలు ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు అని చెప్పింది.