Arjun-Malaika: ఆంటీతో డేటింగ్ ఏంటి.. అర్జున్ ఘాటు రిప్లై!

బాలీవుడ్ లో స్వీట్ కపుల్స్ మాత్రమే కాదు హాట్ కపుల్స్ కూడా చాలానే ఉన్నాయ్. ఆ రెండో బ్యాచ్ లోకే వస్తారు మలైకా అరోరా-అర్జున్ కపూర్. సల్మాన్ ఖాన్ సోదరుడితో దాదాపు రెండు దశాబ్దాల..

Arjun-Malaika: ఆంటీతో డేటింగ్ ఏంటి.. అర్జున్ ఘాటు రిప్లై!

Arjun Malaika

Arjun-Malaika: బాలీవుడ్ లో స్వీట్ కపుల్స్ మాత్రమే కాదు హాట్ కపుల్స్ కూడా చాలానే ఉన్నాయ్. ఆ రెండో బ్యాచ్ లోకే వస్తారు మలైకా అరోరా-అర్జున్ కపూర్. సల్మాన్ ఖాన్ సోదరుడితో దాదాపు రెండు దశాబ్దాల వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన మలైకా తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉండడం.. ఈ జంట తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఎంజాయ్ చేయడం బీ టౌన్ లో ఎప్పుడూ హాట్ టాపికే. ప్రస్తుతం అర్జున్ కపూర్ వయసు 36 ఏళ్ళు కాగా మలైకాకు 48 ఏళ్ళు.

Pushpa Collections: భారీ వసూళ్ల దిశగా పుష్ప.. నార్త్‌లో తగ్గని హవా!

అయితే.. ఈ జంట రిలేషన్ లో ఉందని లీకైనప్పటి నుండే భారీ ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. ఆంటీతో డేటింగ్ ఏంటి అర్జున్ అంటూ అర్జున్ కపూర్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఈ వయసులో నీకు రిలేషన్ అవసరమా ఆంటీ అంటూ మలైకాను ఆడిపోసుకుంటూనే ఉంటారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై.. సోషల్ మీడియాలో ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ హ్యాపీ డేస్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు మీడియా గోల చేసినా ఈ ట్రోలింగ్ వ్యవహారాన్ని ఈ హాట్ కపుల్ పట్టించుకున్న పాపాన పోలేదు.

John Abraham : బాలీవుడ్ స్టార్ కపుల్ కి కరోనా పాజిటివ్

అయితే.. అర్జున్ కపూర్ ఈ ట్రోలింగ్ పై తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న అర్జున్ కొద్ది రోజుల క్రితం ఓ ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆంటీతో డేటింగ్ ఏంటి అనే కామెంట్స్ పై స్పందించాడు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే అకౌంట్లలో సగానికి పైగా ఫేక్ ఉంటాయని.. అలాంటి వాటిపై మనం స్పందించి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఇక.. ఒరిజినల్ అకౌంట్స్ వాళ్ళు అక్కడ కామెంట్ చేసి మేము కనిపించగానే సెల్ఫీ కోసం ఎగబడతారు.. సో వాళ్ళ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటామని చెప్పుకొచ్చాడు.