హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ రిలీజ్

టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ టీజర్ విడులైంది.

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 09:54 AM IST
హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ రిలీజ్

టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ టీజర్ విడులైంది.

టాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ టీజర్ విడులైంది. తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన పాత్రల్లో షాహీద్, కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు సినీ 1 స్టూడియోస్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : హరిద్వార్‌లో హాలీవుడ్‌ స్టార్‌ హీరో

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ దాదాపు అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో ఉంది. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. మరి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు