అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి మాతృ వియోగం

10TV Telugu News

అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఇవాళ(ఆగస్టు-22,2019) తెల్లవారుజామున కన్నమూశారు. స్వస్థలం.. వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో ఆమె తుది శ్వాస విడిచారు.

తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ముంబైలో ఉన్న సందీప్ హుటాహుటిన వరంగల్ కు బయల్దేరారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్ర్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభాకర్ రెడ్డి, సుజాత దంపతులకు సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి అనే పిల్లలు ఉన్నారు. సందీప్ రెడ్డి తల్లి హఠాన్మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.