Vijay Sethupathi: విజయ్ సేతుపతిని కొట్టినవారికి నజరానా!

త‌మిళ హీరో, సౌతిండియన్ ఆర్టిస్ట్ విజ‌య్ సేతుప‌తి ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.

Vijay Sethupathi: విజయ్ సేతుపతిని కొట్టినవారికి నజరానా!

Vijay Sethu

Vijay Sethupathi: త‌మిళ హీరో, సౌతిండియన్ ఆర్టిస్ట్ విజ‌య్ సేతుప‌తి ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవల బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్‌లో విజయ్ సేతుపతిపై దాడి జ‌రగగా.. ఈ గొడ‌వ త‌ర్వాత హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని కొట్టిన వ్యక్తికి రూ.1,001 బహుమతి ఇస్తామని ప్రకటించింది.

స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యన్‌ను అవమానించాడని, అటువంటి వ్యక్తిని కొట్టినవారికి రూ. 1001 ఇస్తామని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ వెల్లడించారు. క్ష‌మాప‌ణ చెప్పేవ‌ర‌కు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టాలని కూడా పిలుపునిచ్చారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్‌లో కొట్టిన వ్యక్తికి కూడా నజరానా ఇవ్వనున్నట్లు చెప్పారు మక్కల్ కట్చి అనే హిందూ సంస్థకు చెందిన అర్జున్ సంప‌త్.


బెంగుళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతిపై మహా గాంధీ అనే వ్యక్తి దాడికి యత్నించగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాగాంధీ మాట్లాడుతూ.. విమానంలో విజయ్ సేతుపతికి కో-ప్యాసెంజర్‌గా ఉన్నానని, జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు శుభాకాంక్షలు తెలపగా.. విజయ్‌ సేతుపతి హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారి తీసిందన్నారు.


తర్వాత, కౌంటర్ వద్ద తన బ్యాగ్‌లను తీసుకుంటున్నప్పుడు విజయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని, దీంతో వాతావరణం వేడెక్కిందని అన్నారు. ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ పూర్తి ఫుటేజీ ఇస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. మహాగాంధీ కూడా పది సినిమాల్లో నటించారు. చాలా కాలంగా సినిమాల్లో ఉన్నాడు. కానీ మహాగాంధీ విజయ్ సేతుపతి సినిమాలేవీ చూడలేదని చెబుతున్నారు.