రామాయణం సీరియల్ లో ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా !

10TV Telugu News

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రజలంతా భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో ప్రజలు, సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తు ప్రజలను అలరిస్తున్నాయి కొన్ని టీవీ ఛానళ్లు.

ఈ లాక్ డౌన్ సమయంలో 1987 లో రామానంద్ సాగర్ నిర్మించిన పౌరాణిక ధారావాహిక రామాయణంను దూరదర్శన్ ఛానల్ పునః ప్రసారం చేయబడింది. ఈ పునః ప్రసారం తర్వాత ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల ప్రస్తుత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

అరుణ్ గోవిల్ : 

అరుణ్ గోవిల్ రాముడి పాత్రను పోషించారు. ఈయన రాముడి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. తర్వాత మరే ఇతర పాత్రల్లోను నటించలేదు. ఇప్పటికి గ్రామాల్లోని ప్రజలు రామానంద్ సాగర్ నిర్మించిన సీరియల్స్ రామాయణ పోస్టర్ ని ఇళ్లలో పెట్టుకుని పూజలు చేస్తుంటారు. 

దీపికా చిఖ్లియా :

దీపికా చిఖ్లియా సీత పాత్రలో నటించింది. ఈమె రామాయణం తిరిగా పునః ప్రసారం కావటం గురించి మాట్లాడుతూ ‘నేను నా కుటుంబంతో కలిసి మళ్ళీ చూసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ’ ఓ స్ధానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపింది. ఎందుకంటే మేము షూటింగ్ చేస్తున్న సమయంలో ఎడిట్ చేసినప్పుడు మాత్రమే చూడగలిగాం అని ఆమె తెలిపింది.

సునీల్ లాహ్రీ : 

రాముడి  తమ్ముడు లక్ష్మణుడుని పాత్రలో సునీల్ లాహ్రీ  అద్భుతంగా నటించారు. ఈయన ఇటీవల ది కపిల్ శర్మ షోలో అరుణ్ గోవిల్, దీపికా చిఖ్లియాతో కలిసి పాల్లొన్నారు.

అంజలి వ్యాస్ : 

అంజలి వ్యాస్ లక్ష్మణుని భార్య ఊర్మిలా పాత్రలో నటించింది. ఈమె సీతా దేవి చెల్లిగా, లక్ష్మణుని పాత్రలో ఒదిగిపోయింది.

బాల్ ధూరి : 

రాముడు తండ్రైన దశరథుని పాత్రలో జీవించారు. ఈయన ప్రస్తుతం మరాఠీ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతను ఇప్పుడు, అప్పుడు ఒకేలాగా కనిపిస్తున్నాడు.

అరవింద్ తివారీ : 

అరవింద్ తివారీ లంకాధిపతి అయిన రావణుని పాత్రను పోషించారు. ఈ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈయన హిందీ, గుజరాతీ చిత్రాలలో నటించాడు.

దారా సింగ్ : 

ఈయన హనుమంతుడి పాత్రలో నటించారు. ఈయన ఆ పాత్రలో జీవించిన తీరు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈయన కొంత అనారోగ్యం కారణంతో చనిపోయారు. కానీ తన చివరి కోరికగా రామాయణం చూడాలని ఉందని చెప్పినట్టు ఆయన కుమారుడు విందు దారా సింగ్ తెలిపారు.  

సమీర్ రాజ్దా : 

సమీర్ రాజ్దా రాముడి తమ్ముడు శత్రుఘ్నడిని పాత్రలో నటించాడు. ఆయన గుజరాతీ సినిమాలు,  టెలివిజన్ షో హమరి దేవ్రానీలలో కనిపించి ప్రజలన్ని అలరించాడు.

సంజయ్ జోగ్ : 
 
సంజయ్ జోగ్ భరతుని పాత్రలో నటించారు. ఆ తర్వాత ఈయన కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించారు. ఈయన 40 సంవత్సరాలకే కిడ్ని సమస్యతో చనిపోయారు.