Arun Pandian : హీరోలకే కోట్లు పెడితే మంచి సినిమాలు ఎలా వస్తాయి??

తమిళ నటుడు, నిర్మాత అరుణ్‌ పాండ్యన్‌ మాట్లాడుతూ..''సినిమా 410 కోట్లతో తెరకెక్కిస్తే అందులో కేవలం 10 కోట్లే కథకు ఖర్చుపెట్టి మిగిలింది నటుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇలా చేయడం.......

Arun Pandian : హీరోలకే కోట్లు పెడితే మంచి సినిమాలు ఎలా వస్తాయి??

Arun

Arun Pandian :  ప్రస్తుతం సౌత్ సినిమాలు మంచి ఫామ్ లో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలకి ధీటుగా కాదు ఏకంగా వాటిని దాటి మరీ సౌత్ సినిమాలు వెళ్తున్నాయి. ఇక సౌత్ లో ఇటీవల కాలంలో తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలు వరుస హిట్స్ సాధిస్తున్నాయి. కానీ కోలీవుడ్ లో మాత్రం ఒకటి రెండు తప్ప చెప్పుకోదగ్గ భారీ విజయాలు ఇటీవల కాలంలో లేవు. స్టార్ హీరోల సినిమాలు సైతం చతికిలపడుతున్నాయి. తాజాగా తమిళ్ లో ఏర్పడిన ఈ పరిస్థితిపై నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ మాట్లాడారు.

తమిళ్ లో త్వరలో రాబోతున్న ఓ సినిమా ‘ఆధార్‌’. కరుణాస్‌ హీరోగా నటించిన ఈ సినిమాకి రాంనాథ్‌ పళణికుమార్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమం జరగగా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమిళ నటుడు, నిర్మాత అరుణ్‌ పాండ్యన్‌ మాట్లాడుతూ..”సినిమా 410 కోట్లతో తెరకెక్కిస్తే అందులో కేవలం 10 కోట్లే కథకు ఖర్చుపెట్టి మిగిలింది నటుల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇలా చేయడం వల్లే తమిళ సినిమా నశించిపోతోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలే బ్రహ్మాండంగా ఉంటున్నాయి, అవే ప్రేక్షకులని బాగా అలరిస్తున్నాయి” అని అన్నారు.

Shivani Rajashekar : మిస్ ఇండియా పోటీల్లో రాజశేఖర్ కూతురు..

అయితే తమిళ సినిమా ఫంక్షన్ లో తెలుగు సినిమానే బెటర్ గా ఉందని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అక్కడ వివాదాస్పదంగా మారాయి. దీనిని కొంతమంది తమిళ సినీ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ ఇదే నిజమని అందరికి తెలిసిన విషయమే.