Ajith – Arvind Swamy : అజిత్‌కి విలన్‌గా అరవింద్ స్వామి..

లవ్లీ హీరో 'అరవింద్ స్వామి'ని విలన్ గా మార్చేసిన సినిమా 'త‌నీ ఒరువ‌న్'. అయితే అరవింద్ స్వామి కథలో బలం ఉంది అని నమ్మితేనే ఆ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాను అని చెబుతున్నాడు. తాజాగా అలా ఒక దర్శకుడు చెప్పిన కథ అరవింద్ స్వామికి బాగా నచ్చడంతో ఆ మూవీలో విలన్ పాత్ర పోషించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

Ajith – Arvind Swamy : అజిత్‌కి విలన్‌గా అరవింద్ స్వామి..

Arvind Swamy playing villain role in ajith movie

Ajith – Arvind Swamy : రోజా సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన నటుడు ‘అరవింద్ స్వామి’. అటువంటి లవ్లీ హీరోని విలన్ గా మార్చేసిన సినిమా ‘త‌నీ ఒరువ‌న్’. తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో రామ్ చరణ్ ‘ధ్రువ’ పేరుతో డబ్ చేశాడు. ధ్రువలో కూడా అరవింద్ స్వామే విలన్ గా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు అరవింద్ స్వామి.

Ajith: తెగింపు చూపిస్తోన్న అజిత్.. బరిలో ముందుగా దిగుతున్నాడుగా!

అయితే అరవింద్ స్వామి కథలో బలం ఉంది అని నమ్మితేనే ఆ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాను అని చెబుతున్నాడు. తాజాగా అలా ఒక దర్శకుడు చెప్పిన కథ అరవింద్ స్వామికి బాగా నచ్చడంతో ఆ మూవీలో విలన్ పాత్ర పోషించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే తమిళ హీరో అజిత్ కుమార్ 62వ చిత్రం. ఈ మూవీకి విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో అజిత్ అండ్ అరవింద్ ఇద్దరి పాత్రలు నెగటివ్ షేడ్ ఉంటాయని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో వీరిద్దరూ ‘పాసమలార్‌గల్’ సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ 29 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ మూవీ కోసం చేతులు కలపబోతున్నారు. ప్రస్తుతం అజిత్ ‘తునివు’ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ హీస్ట్ కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమాని ‘తెగింపు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మంజు వారియర్ ఫిమేల్ లీడ్ లో కనిపిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాషల్లో ఒకేరోజు జనవరి 11న సంక్రాంతి బరిలోకి దిగబోతుంది.