Arya : గ్రహాంతర వాసితో పోరాటంపై ఇండియాలో మొట్టమొదటి సినిమా
హాలీవుడ్ లో గ్రహాంతర వాసులతో పోరాటంపై చాలానే సినిమాలు ఉన్నాయి. అలాంటి ఏలియన్ సినిమాలు ఇండియాలో ఇప్పటివరకు రాలేదు. వచ్చిన ఒకటి, రెండు సినిమాలు కూడా పూర్తి స్థాయి ఏలియన్ సినిమాలు....

Arya : ఏలియన్స్, గ్రహాంతర వాసులు ఉన్నాయో లేవో తెలీదు కానీ మనం మాత్రం వాటి మీద సినిమాలు తీస్తాం, చూస్తాం. గ్రహాంతర వాసులపై హాలీవుడ్ లో సినిమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏలియన్స్ మీద చాలా సినిమాలు వస్తుంటాయి హాలీవుడ్ లో. అందులో కొన్ని ఏలియన్స్ తో స్నేహం చేసేలా ఉంటే, మరి కొన్ని ఏలియన్స్ తో పోరాడేలా ఉంటాయి. హాలీవుడ్ లో గ్రహాంతర వాసులతో పోరాటంపై చాలానే సినిమాలు ఉన్నాయి.
అలాంటి ఏలియన్ సినిమాలు ఇండియాలో ఇప్పటివరకు రాలేదు. వచ్చిన ఒకటి, రెండు సినిమాలు కూడా పూర్తి స్థాయి ఏలియన్ సినిమాలు కావు. తాజాగా ఇండియాలో మొట్టమొదటి సారిగా పూర్తి స్థాయిలో ఏలియన్స్ తో పోరాటం చేసే సినిమా రాబోతుంది. అది కూడా కోలీవుడ్ లో. తమిళ హీరో ఆర్య హీరోగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా రాబోతుంది. ‘కెప్టెన్’ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Sai Manjrekar : తెలుగు హీరోలపై ‘గని’ హీరోయిన్ సయీ మంజ్రేకర్ వ్యాఖ్యలు..
ఈ పోస్టర్ లో గన్ పట్టుకుని మాస్ లుక్‌లో ఉన్న ఆర్యతో పాటు భయంకరంగా ఉండే ఓ గ్రహాంతర వాసి కనిపిస్తోంది. ఆ జీవిని పూర్తిగా సీజీలో చిత్రీకరిస్తున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. సినిమాలో ఎక్కువశాతం గ్రాఫిక్స్ లోనే ఉంటుందని, ఇందులో హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఏలియన్స్ తో హీరో ఆర్య పోరాడుతున్నట్టు కథ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఇలాంటి యాక్షన్ ఏలియన్ సినిమాలు హాలీవుడ్ లో వస్తే ఇష్టపడి మరీ చూస్తాం. మరి మొదటిసారి ఇండియాలో రాబోతున్న ఈ సినిమాని మన ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.