Sharukh Khan : ఆర్యన్ కేసుతో ఆగిపోయిన షారుఖ్ సినిమాలు

ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్‌తో షారుక్‌ఖాన్ ఈ కేసు గురించే ఆలోచిస్తూ తన కొడుకుని ఎలా బయటకి తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఈ అరెస్ట్ తో షారుఖ్ ప్రస్తుతం చేస్తున్న షూటింగ్స్ అన్ని

Sharukh Khan : ఆర్యన్ కేసుతో ఆగిపోయిన షారుఖ్ సినిమాలు

Sharukh

Sharukh Khan :  ఇటీవల డ్ర‌గ్స్ కేసులో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆర్య‌న్ జైల్లో ఉన్నాడు. ఇప్పటికే బెయిల్ ట్రై చేసినా ఇంకా రాలేదు. ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. మొదట డ్రగ్స్ వాడారని అరెస్ట్ చేసినా ఇప్పుడు డ్రగ్స్ సప్లై కూడా చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ తో లావాదేవీలు జరిపాడు అని తేలడంతో ఈ కేసు మరింత తీవ్రమవుతుంది. ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్‌తో షారుక్‌ఖాన్ ఈ కేసు గురించే ఆలోచిస్తూ తన కొడుకుని ఎలా బయటకి తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఈ అరెస్ట్ తో షారుఖ్ ప్రస్తుతం చేస్తున్న షూటింగ్స్ అన్ని ఆపేశాడు. కొన్ని సినిమాలు వాయిదా వేశాడు.

Sara Ali Khan : కోట్లు సంపాదించావు… బిచ్చగత్తెకు ఇచ్చేది పది రూపాయలేనా? ప్రముఖ నటిపై దారుణమైన ట్రోలింగ్

తాజా స‌మాచారం ప్ర‌కారం ప్రస్తుతం షారుఖ్ స్పెయిన్ లోని ప‌ఠాన్ లో షూటింగ్ చేయాలి. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ సిద్దార్థ్ ఆనంద్ స్పెయిన్‌కు వెళ్లాడు. రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం మేక‌ర్స్ స్పెయిన్‌లోనే ఉన్నారు. కానీ ఆర్యన్ అరెస్ట్ తర్వాత భారత్ కి తిరిగి వచ్చారు. దీంతో ఈ సినిమా షూట్ ఆగిపోవడమే కాక నిర్మాతకి నష్టం మిగిల్చింది. మరో చిత్రం షూటింగ్ కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు… నటిపై రూ.50కోట్లకు పరువు నష్టం దావా

మ‌రోవైపు తమిళ్ హీరో విజయ్ తో హ్యాట్రిక్ కొట్టిన డైరెక్ట‌ర్ ఆట్లీ షారుఖ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్‌కు కూడా షారుక్ హాజరవ్వట్లేదు. దీంతో షారుక్‌ఖాన్ డూప్‌ ప్రశాంత్ వాల్దే ఇత‌ర న‌టీన‌టుల‌తో కొన్ని స‌న్నివేశాలను షూట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. ఇక స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తోన్న ‘టైగ‌ర్ 3’ సినిమాలో షారుక్ కీ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో సల్మాన్ సినిమాకి కూడా బ్రేక్ పడింది. ఆర్య‌న్ బెయిల్ తీర్పు త‌ర్వాత షారుక్ ఖాన్ షూటింగ్స్ పై స్ప‌ష్ట‌త రానుంది. ఆర్య‌న్ కేసు వ్య‌వ‌హారం షారుక్ సినిమాల‌పై చాలా ఎఫెక్ట్ ప‌డింద‌ని బాలీవుడ్ సమాచారం.