Bigg Boss 5: అనుకున్నదే జరిగింది.. ట్విస్టుల మధ్య ప్రియా ఔట్!

బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఏడు వారాలు పూర్తయి ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఇప్పుడు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. మొత్తానికి పడి లేస్తూ ఏడు వారాలను పూర్తి..

Bigg Boss 5: అనుకున్నదే జరిగింది.. ట్విస్టుల మధ్య ప్రియా ఔట్!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఏడు వారాలు పూర్తయి ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఇప్పుడు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. మొత్తానికి పడి లేస్తూ ఏడు వారాలను పూర్తి చేసుకున్న ఈ షోలో ఈ వారం ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచి బెటర్ అనిపించాడు బిగ్ బాస్. మధ్యలో రేటింగ్స్ కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ ప్రత్యేకమైన టాస్క్ లతో నిర్వాహకులు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది. ఇక, ఈ వారం కూడా ముందు ఊహించినట్లే ఎలిమినేషన్ కూడా జరిగింది.

Bigg Boss 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనే.. తన కోపమే తనని ముంచిందా??

గతంలో వారం ప్రియా ఇంట్లో చేసిన తప్పులే ఆమెని ఈ వారం బయటకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆమె కోపం, ఆవేశం ఆమె కొంపముంచింది. ఈ వారం ఆమెలోని ఆవేశంతో కూడిన ప్రేమ ప్రేక్షకులను తెగ ఆకర్షించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి ఈ వారం ప్రియా ఇంటి నుండి బయటకి వచ్చేసింది. మునుపటి కంటే మరికాస్త జోష్ గా కనిపించిన నాగ్ వివిధ రకాల గేమ్స్ ఆడిస్తూ ఒకరి తరువాత మరొకరిని సేవ్ చేసుకుంటూ వచ్చి చివరికి అనీ మాస్టర్, ప్రియాలు ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్నట్లుగా ప్రకటించాడు.

Bigg Boss 5: దారుణంగా పడిపోతున్న రేటింగ్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎప్పుడో?

వీళ్లిద్దరినీ హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని నాగ్ ఆదేశించడంతో ఇద్దరూ ఎలిమినేషన్ అవుతారేమోనని అందరూ తెగ టెన్షన్ పడ్డారు. ఇద్దరినీ గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్ళమనడంతో ఇద్దరూ బాక్సులలోకి వెళ్లారు. రెడ్ లైట్ ఆగిపోగానే బాక్సులను ఓపెన్ చూసి చూస్తే ఇద్దరూ లేరు. దీంతో ఇద్దరూ లేకపోవడం.. స్టేజ్ మీదకి వచ్చారేమో అని నాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరూ ఎలిమినేషన్ ఆ అని అంతా షాక్ తిన్నారు. చివరికి ప్రియా ఎలిమినేషన్ అయి స్టేజి మీదకి రాగా.. అనీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది.