Venky Kudumula Film: హీరోయిన్ దొరికేసినట్లే.. మెగాస్టార్ జోడీగా మాళవికా

సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్స్ సమస్య వేధిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ఏమో ఫ్యాన్స్ ఫెడవుట్ అంటున్నారు.

Venky Kudumula Film: హీరోయిన్ దొరికేసినట్లే.. మెగాస్టార్ జోడీగా మాళవికా

Venky Kudumula Film

Venky Kudumula Film: సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్స్ సమస్య వేధిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ ఏమో ఫ్యాన్స్ ఫెడవుట్ అంటున్నారు. ఇప్పుడొచ్చే యంగ్ హీరోయిన్స్ ఏమో సీనియర్స్ పక్కన ఎబ్బెట్టుగా ఉంటుంది. మధ్యలో స్టార్ హీరోయిన్స్ డేట్స్ ఏమో దర్శకులకు దొరకట్లేదు. అందుకే తెలుగులో సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హీరోయిన్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు.

Jr NTR: ముహూర్తం పెట్టేసిన యంగ్ టైగర్.. ఇక నాన్ స్టాప్ లెక్కే!

చిరంజీవి మెగాస్టార్ అయినా హీరోయిన్స్ సమస్య మాత్రం కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి నటించే వాటిలో గాడ్ ఫాదర్ కోసం నయనతార తీసుకుంటే.. భోళాశంకర్ కోసం గతంలో సైరా నరసింహారెడ్డిలో నటించిన తమన్నాను రిపీట్ చేస్తున్నారు. ఇక బాబీ సినిమా కోసం ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. మరోవైపు వెంకీ కుడుములతో కూడా చిరంజీవి ఒక సినిమా ఫైనల్ చేశాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ వేట ఫలించినట్లు తెలుస్తుంది.

Nikki Tamboli: బాబోయ్.. పోజులతోనే పిచ్చెక్కించేస్తుందే!

వెంకీ కుడుముల సినిమాలో మెగాస్టార్ జంటగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి కాగా మాళవికా ఒకే చెప్పిందట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తమిళంలో పెట్టా, మాస్టర్ సినిమాలలో నటించిన మాళవికాకి ఇదే తెలుగులో డెబ్యూ కావడంతో చిరంజీవి పక్కన పెయిర్ సెట్టయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఏజ్ తక్కువే అయినా మాళవికా సీనియర్ హీరోల పక్కన సీనియర్ గా కనించడమే కలిసొచ్చే అంశంగా మేకర్స్ భావిస్తున్నారట.