Ashish : సుకుమార్ నిర్మాణంలో ‘రౌడీ బాయ్స్’ హీరో రెండో సినిమా

'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. మొదటి సినిమా అయినా ఆశిష్ తన నటనతో అందర్నీ మెప్పించగలిగాడు. మొదటి సినిమా రిలీజ్ అయిన వారానికి రెండో సినిమా కూడా ప్రకటించి........

Ashish :  సుకుమార్ నిర్మాణంలో ‘రౌడీ బాయ్స్’ హీరో రెండో సినిమా

Sukumar Ashish

Sukumar :  దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడో రావాల్సినా కరోనా వల్ల వాయిదా పడుతూ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా అయినా ఆశిష్ తన నటనతో అందర్నీ మెప్పించగలిగాడు. మొదటి సినిమా రిలీజ్ అయిన వారానికి రెండో సినిమా కూడా ప్రకటించి అందరికి షాకిచ్చాడు ఆశిష్.

ఆశిష్ రెండో సినిమా సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కబోతుంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ కి చెందిన సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఆశిష్ హీరోగా తన రెండో సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దగ్గర చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేసిన కాశి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమాకి ‘సెల్ఫిష్‌’ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేయడం విశేషం.

Varun Dhavan : అతనే నాకు సర్వస్వం.. డ్రైవర్ పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరో

మొత్తానికి స్టార్ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి హీరోగా వచ్చి ‘రౌడీ బాయ్స్’తో మంచి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. వెంటనే రెండో సినిమా కూడా అనౌన్స్ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపుతో సినిమాలు చేస్తే భవిష్యత్తులో ఆశిష్ కూడా మంచి హీరోగా సెటిల్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.