Ashu Reddy Oo Antava Song: ఊ అంటావా మావా.. ఇరగదీసిన అషు!

అల్లు అర్జున్ తొలి క్రేజీ పాన్ ఇండియా సినిమా పుష్పా థియేటర్లలో విడుదల కాకముందే అందులోని ఐటమ్ సాంగ్ ఊ అంటావా టాప్ లేపేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన మొదటి డ్యాన్స్ నంబర్ ఇదే కాగా..

Ashu Reddy Oo Antava Song: ఊ అంటావా మావా.. ఇరగదీసిన అషు!

Ashu Reddy Oo Antava Song

Ashu Reddy Oo Antava Song: అల్లు అర్జున్ తొలి క్రేజీ పాన్ ఇండియా సినిమా పుష్పా థియేటర్లలో విడుదల కాకముందే అందులోని ఐటమ్ సాంగ్ ఊ అంటావా టాప్ లేపేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన మొదటి డ్యాన్స్ నంబర్ ఇదే కాగా తొలి పాటతోనే ఊ ఊపు ఊపేసింది. ఈ సినిమాలో బన్నీ-రష్మిక పాత్రలు ఎంత కనెక్ట్ అయ్యాయో.. అంతకంటే ఎక్కువే సమంత ఐటమ్ సాంగ్ సినిమా విడుదలకు ముందే విజయానికి యాడ్ అయింది. ఈ పాట వివాదాస్పదమే కాకుండా పేరడీలకు బాగానే ఉపయోగపడింది.

Star Heroin’s: హీరోలతో సమానంగా క్రేజ్.. లెక్క మార్చేస్తున్న హీరోయిన్స్!

ఇక, ఈ పాటకి రీమేక్ లు.. ట్రిబ్యులకు కూడా తక్కువేం లేదు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఊ అంటావా మావా పాట ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇక, జూనియర్ సమంతగా.. సోషల్ మీడియా నుండి వయా బిగ్ బాస్ తో స్మాల్ స్క్రీన్ సమంతాగా మారిన అషురెడ్డి ఊ అంటావా మావా పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేసి ఛాన్స్ వచ్చేస్తుంది. గత నాలుగు రోజుల క్రితం అషు ఈ పాటలో తాను ఎలా ఉంటానో అని సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి.

Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!

కాగా ఇప్పుడు అషురెడ్డి ఊ అంటావా మావా పాట టీజర్ విడుదలైంది. యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సమంతను మించిన బోల్డ్ అప్పీల్ తో అషు చేసిన ఈ పాట ఎలా ఉంటుందా అని ఊ అంటావా మావా పాట ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సహజంగానే బోల్డ్ బ్యూటీగా రెచ్చిపోయే అషు ఈ పాటలో ఇరగదీయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ పాట ఎప్పుడొస్తుందో చూడాలి.