Ashu Reddy : ప్రెగ్నెంట్ అయిన అషూరెడ్డి.. పిచ్చ కొట్టుడు కొట్టిన అషూ తల్లి..

అషూ ఏడుస్తుంటే ఏమైందని అషూ తల్లి ప్రశ్నించగా నాకు పీరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అషూ ఏడుస్తూ.......

Ashu Reddy : ప్రెగ్నెంట్ అయిన అషూరెడ్డి.. పిచ్చ కొట్టుడు కొట్టిన అషూ తల్లి..

Ashu

Ashu Reddy :  డ‌బ్ స్మాష్‌లో వీడియోలు చేస్తూ జూనియ‌ర్ స‌మంతగా పేరు తెచ్చుకొని అద‌ర‌గొట్టిన అషూ రెడ్డి ఆ తర్వాత టిక్ టాక్ లతో బాగా ఫేమ్ తెచ్చుకొని ఏకంగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షోతో సెల‌బ్రిటీ స్టేట‌స్ తెచ్చేసుకుంది. ఆ తర్వాత యాంకర్ గా కూడా మారిపోయింది. ఒక పక్క ఓ షోలో యాంకర్ గా, మరో పక్క యూట్యూబ్ వీడియోలతో పాటు ఇంస్టాగ్రామ్ రీల్స్ లోను అదరగొడుతుంది అషూరెడ్డి. సోష‌ల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో, వీడియోలతో రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల ఆర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ అని హడావిడి కూడా చేసింది. దీంతో అషూకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది.

Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!

తాజాగా అషూరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ కి ప్ర‌గ్నెన్సీ పేరుతో ఓ ప్రాంక్ వీడియో చేసింది. అయితే అది కూడా వాళ్ళ అమ్మ మీదే ప్రాంక్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. ఇంట్లో కూర్చొని అషూ ఏడుస్తుంటే ఏమైందని అషూ తల్లి ప్రశ్నించగా నాకు పీరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అషూ ఏడుస్తూ ఉండ‌డంతో అషూ తల్లి షాక్ అయి తర్వాత కోపం తట్టుకోలేక అషుని కొట్టింది. కాలితో కూడా తన్ని పిచ్చ కొట్టుడు కొట్టింది. అషూ మదర్ కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అంటూ బతిమాలింది.

Shannu Deepu : షన్ను-దీపు పెళ్ళికి మాకు ఓకే.. కానీ ఒక్క కండిషన్ : షణ్ముఖ్ పేరెంట్స్

అయితే అషూ మదర్ పిచ్చ కొట్టుడు కొట్టడంతో చివరికి ఇది ప్రాంక్ వీడియో అని, నిజం కాదని చెప్పి అక్కడ ఉన్న కెమెరాలను చూపించింది. దీంతో అషూ త‌ల్లికి మ‌రింత కోపం వచ్చి మళ్ళీ కొట్టింది. హార్ట్ ఎటాక్ తెప్పించినంత ప‌ని చేశావు అంటూ సీరియ‌స్‌గా వెళ్లిపోయింది అషూ తల్లి. దీంతో యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వీడియో చుసిన వాళ్లంతా ఇదంతా స్క్రిప్టెడ్ వీడియో అని, అషూ వాళ్ళ మదర్ తో కూడా యాక్ట్ చేయించిందని, యూట్యూబ్ లో వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చిపిచ్చి వీడియోలు చేస్తావా అంటూ అషూని కామెంట్లలో గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.