అశ్వథ్థామ – రివ్యూ

యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : January 31, 2020 / 11:08 AM IST
అశ్వథ్థామ – రివ్యూ

యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’ రివ్యూ..

యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’.. ఈ సినిమాకు నాగశౌర్య కథనందించడం విశేషం. టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అశ్వథ్థామ’ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..

Naga Shourya
విశాఖలో వరుసగా అమ్మాయిలు  మాయమవుతుంటారు.  ఆ మాయమైన అమ్మాయిలు ఏదో ఒక హాస్పటల్‌లో తేలుతారు. షుగర్ లెవెల్స్ పడిపోయి, నీరసంతో ఏ రోడ్డు మీదో పడిపోతే ఆసుపత్రిలో చేర్చినట్టు రిపోర్డులు. ఈ లైన్స్ మధ్య ఏం జరుగుతోంది అనేదాన్ని అశ్వథ్థామ అంత చాకచక్యంగా  ఛేదించిన ఓ యువకుడి కథే  ఈ అశ్వథ్థామ.. నాగశౌర్యను  పూర్తి స్థాయి మాస్ హీరోగా ఎలివేట్ చేయడానికి జరిగిన ప్రయత్నం ఇది. థ్రిల్లర్ జానర్‌లో సాగే ఓ క్రైమ్ మిస్టరీ ఇది. చాలా పకడ్బందీగా  స్క్రీన్‌‌ప్లే రాసుకున్నారు. నిజానికి ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్ కథే. 

Read Also : చూసీ చూడంగానే – రివ్యూ

ఆడపిల్లల అపహరణ నేపధ్యంలో చిత్రం సాగడం.. నేరస్తుణ్ణి పట్టుకోడానికి  నాన్ పోలీస్ యువకుడు ఇన్వెస్టిగేట్ చేయడం లాంటి అంశాలు చూసినప్పుడు ‘రాక్షసుడు’ అనే సినిమా గుర్తొస్తుందిగానీ.. ఇందులో గొడవ వేరు. అమెరికా నుంచీ హీరో తన చెల్లెలి పెళ్లికోసం ఇండియా వస్తాడు. చెల్లి కూడా అలా షుగర్ లెవెల్స్ పడిపోయి ఆపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో జాయిన్ అవుతుంది. హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత చెల్లెలి జీవితంలో సంభవించిన ఓ విషాదాన్ని చూసి చలించిపోతాడు హీరో. ఎవరు చేస్తున్నారిదంతా అనే కోణంలో తను కేవలం ఓ విక్టిమ్ అన్నగా పరిశోధనకు దిగుతాడు. ఆ మధ్య  చెల్లి కోసం చెల్లి ఉంటున్న నగరాన్ని రౌడీ రహితం చేసిన అన్న అన్నవరాన్ని చూశాం కదా.. అలా అన్నమాట.. 

Aswathama

ఫస్టాఫ్ కాస్త లాగినట్టు అనిపించినా సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా నడిపించే ప్రయత్నం చేశారు దర్శకుడు రమణ తేజ. సంభాషణలు  చాలా మామూలుగా  ఉండడం  చిత్రానికి సంబంధించిన ఓ లోపం. ఇంకాస్త కేర్ తీసుకుంటే బావుండేది. పాత్రకు జరగబోయేది తెలియకూడదు కదా ఎంత ముందే రాసుకున్న స్క్రిప్టు అయితే మాత్రం?  ఇలాంటి కొన్ని లోపాలు సవరించుకుని  ఉంటే.. సినిమా నిజంగానే  మంచి విజయం సాధించేది. విలన్ ఎవరు అనే అంశాన్ని ఆడియన్స్‌కు రివీల్ చేయడం చేసిన తర్వాత ఆ పాత్రకు హైప్ తీసుకురావడం లాంటివి సెకండాఫ్‌ను నిలబెట్టేశాయి. 

నాగశౌర్య నటుడుగా తన సత్తా చాటాలనుకున్నాడు, చాటాడు. సెకండాఫ్‌తో పాటు క్లైమాక్స్ కనెక్ట్ కావడంతో ఆడియన్స్ పాజిటివ్ ఫీల్‌తోనే బయటకు వస్తారు. 
నటీనటుల పరంగా హీరో నాగశౌర్య తర్వాత ప్రతి నాయక పాత్రలో నటించిన జిసుసేన్ గుప్తా చాలా బాగా చేశారు. పాత్రను ఫీలవుతూ చేయడం చేసిన విధానం బావున్నాయి.  
తెలుగు సినిమాల్లో అతనికి మరిన్ని అవకాశాలు తప్పకుండా వస్తాయి అనడంలో సందేహం లేదు.  నటీనటుల్లో ఈ ఇద్దరి తర్వాత చెప్పుకోవాల్సి వస్తే.. హీరో చెల్లెలి పాత్రలో నటించిన సర్గుణ్ కౌర్. హీరోయిన్ మెహ్రీన్‌కు ఇందులో పెద్దగా అవకాశం లేదు. కేవలం హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుగానే ఆ పాత్ర ఉంటుంది. ఈ సినిమా తనకు పెద్దగా హెల్ప్ అయ్యేది కూడా లేదు. 

Aswathama
దర్శకుడు రమణతేజ సన్నివేశాల రూపకల్పన విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుంటేది. మనోజ్ రెడ్డి కెమేరా పనితనం బావుంది. అలాగే జిబ్రాన్ నేపధ్య సంగీతం కూడా సినిమాకు తగ్గ మూడ్ తీసుకువచ్చింది. లవర్ బాయ్ కారక్టర్ల నుంచి తనను తాను మ్యాన్లీ హీరోగా ప్రూవ్ చేసుకోడానికి నాగశౌర్య చేసిన  ప్రయత్నమే ఈ అశ్వథ్థామ. ఆ మేరకు  సినిమా అంతా అతన్ని ఎలివేట్ చేయడానికే కసరత్తు చేశారు. అదే తెర మీద కనిపించింది కూడా. క్లైమాక్స్  సీన్ మరీ సాదాసీదా లాగించేసినట్టు అనిపించింది. విలన్ విషయంలో మరింత గోప్యత పాటించి ఉంటే బావుండేది. 

ప్లస్ పాయింట్స్ 
నాగశౌర్య కథ 
ఆకట్టుకున్న సెకండాఫ్
విలన్ పాత్రధారి నటన
తీసుకున్న పాయింట్

మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లే లోపాలు 
సంభాషణల్లో గందరగోళం 
తేలిపోయినట్టున్న క్లైమాక్స్