Project K: రెబల్ స్టార్‌తో అశ్విన్ సినిమా.. కీలక మార్పులు చేశారా?

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా రాధేశ్యామ్ విడుదల కాలేదు.. కానీ ఆదిపురుష్, సలార్ కూడా చివరి దశకి వచ్చేసింది.

Project K: రెబల్ స్టార్‌తో అశ్విన్ సినిమా.. కీలక మార్పులు చేశారా?

Project K

Project K: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా రాధేశ్యామ్ విడుదల కాలేదు.. కానీ ఆదిపురుష్, సలార్ కూడా చివరి దశకి వచ్చేసింది. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్, నాగ్ అశ్విన్ కాంబో ప్రభాస్ ప్రాజెక్ట్ కే కి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా కూడా పట్టాలెక్కనుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే లో కీలక మార్పులు జరిగాయని టాలీవుడ్ సమాచారం.

Sara Ali Khan : సాగరతీరాన సోకులారబోస్తున్న సారా

ముందుగా ఈ భారీ బడ్జెట్ సినిమాకి టాలెంటడ్ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు కోలీవుడ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తో రీప్లేస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్లే సంతోష్ నారాయణ్ కూడా వైజయంతి వారి ట్వీట్ ని రీట్వీట్ చేయడంతో ఫిక్స్ మిక్కీని సంతోష్ రీప్లేస్ చేశాడని గట్టిగా చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతుంది.

Amitab : పాన్ మసాలా బ్రాండ్‌కు లీగల్ నోటీసులు పంపిన అమితాబ్

సంతోష్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ అతని మ్యూజిక్ మాత్రం బాగానే పరిచయం. ఎందుకంటే సంతోష్ సంగీతం అందించిన కాలా, కబాలి మ్యూజిక్ కు తెలుగు ఆడియెన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ఇక, ఈ సినిమాపై జరుగుతున్న మరో ప్రచారం ఇది వైజయంతీ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుందని చెప్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా మినిమమ్ బడ్జెట్ రూ.500 కోట్ల పైనేనని.. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో సిద్ధం చేయాలని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. మరి.. సినిమా మొదలైతే కానీ ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు.