అక్షయ్ సాయం.. కృతజ్ఞతలు తెలిపిన సీఎం..

  • Published By: sekhar ,Published On : August 19, 2020 / 12:32 PM IST
అక్షయ్ సాయం.. కృతజ్ఞతలు తెలిపిన సీఎం..

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకృతి వైపరీత్యాలు, ఇత‌ర‌త్రా విప‌త్తులు సంభవించినప్పుడు తనవంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవల కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలో అక్ష‌య్ పీఎం కేర్ ఫండ్‌కు నిధులు అందించ‌డ‌మే కాకుండా, కరోనా వారియర్స్‌తో సహా పేదల‌కు వివిధ మార్గాల‌లో సహాయం అందించారు. ఇప్పుడు అసోం వ‌ర‌ద బాధితుల‌కు సహాయం చేయడానికి అక్ష‌య్ రూ. కోటి విరాళం ప్ర‌క‌టించారు. ఈ నేప‌ధ్యంలో అసోం సీఎం సర్బానంద సోనోవాల్ అక్షయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



‘విపత్తులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి మీరెప్పుడూ ముందుంటారు. అసోం వరద బాధితుల సహాయార్థం రూ. 1 కోటి సాయం చేసినందుకు కృతజ్ఞతలు.. అసోంకి మీరు నిజమైన స్నేహితుడు.. మీ రంగంలో మరింత ముందుకు వెళ్లాడానికి దేవుడు దీవెనలు అందించాలని కోరుకుంటున్నాను’.. అంటూ సీఎం సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు అక్ష‌య్‌ బీహార్ వరద బాధితుల సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించారు.