‘అశ్వథ్థామ’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న‘అశ్వథ్థామ’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్.. సినిమాను 2020 ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..

యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న‘అశ్వథ్థామ’ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్.. సినిమాను 2020 ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..
యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘అశ్వథ్థామ’.. శుక్రవారం సాయంత్రం కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
నాగశౌర్య డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఫైట్ మాస్టర్ అన్బరివ్ ఆధర్వంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. డూప్ లేకుండా నటించడం వల్ల నాగశౌర్య ఎడమకాలికి తీవ్ర తీవ్ర గాయమవగా కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు నాగశౌర్య.
‘అశ్వథ్థామ’ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ రూ.3.15 కోట్లకు ‘అశ్వథ్థామ’ శాటిలైట్ రైట్స్ దక్కించుకుందని సమాచారం. 2020 ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.