పదహారేళ్లకే కాలేజిలోనే పనిలో దిగేశా.. : కాజల్

  • Published By: vamsi ,Published On : July 27, 2020 / 07:05 AM IST
పదహారేళ్లకే కాలేజిలోనే పనిలో దిగేశా.. : కాజల్

జీవితంలోనూ సినిమా విషయంలోనూ ప్రతి సమస్యను నేను సవాలుగా తీసుకుంటానని చెప్పారు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సమస్య నుంచి పారిపోవడం అనే భయం తనకు లేదని ఆమె అన్నారు. అలా చేయడం మనల్ని బలహీనపరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. నేను నటించిన ప్రతి సినిమాలో నాకు చాలా సవాలుగా ఉండే పాత్రలు వచ్చాయని ఆమె చెప్పారు.

నిజానికి చిన్నప్పటి నుంచే భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుందని వాళ్లు తర్వాత అదే చేస్తారా? లేదా? అనేది తెలియదు అని అన్నారు. తాను కూడా ఏం చేయాలో అర్థం కాక గందరగోళానికి గురైనట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిస్థితుల నుంచే చక్కటి ఆలోచన తట్టిందని ఆమె చెప్పారు. అసలు నేను ఏ పని చేస్తే నా మనసుకు సంతృప్తికరంగా అనిపిస్తుందని తెలుసుకోవడానికి ముందు ఏదోక పని చేసి చూడాలి అనుకున్నట్లు వెల్లడించారు.

ఓ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలో చేరినట్లు చెప్పారు. అలా పదహారేళ్ల వయసు నుంచే, కాలేజీలో ఉన్నప్పుడే ప్రతి వేసవిలో ఓ ఉద్యోగం వెతుక్కునేదాన్ని అని కాజల్ చెప్పారు. ఏ పనినైతే ఇష్టంగా చేస్తానో తెలియడానికే అలా చేశానని అన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగా.. లోరియల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చేరానని, కాలేజీ అయ్యాక దాదాపు పది నెలలు అందులోనే చేసినట్లు చెప్పారు. తర్వాత ఎంబీఏలో చేరి సినిమా అవకాశాలు రావడంతో నటిగా బిజీగా మారి నటనలోనే నాకు సంతృప్తి, సంతోషం ఉన్నాయని అర్థం అయ్యిందని చెప్పారు.