నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన ‘అతడే శ్రీమన్నారాయణ’ – ట్రైలర్

‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రక్షిత్ శెట్టి నటిస్తున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ థియేట్రికల్ ట్రైలర్ నేచురల్ నాని చేతుల మీదుగా విడుదలైంది..

  • Published By: sekhar ,Published On : November 28, 2019 / 12:54 PM IST
నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన ‘అతడే శ్రీమన్నారాయణ’ – ట్రైలర్

‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రక్షిత్ శెట్టి నటిస్తున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ థియేట్రికల్ ట్రైలర్ నేచురల్ నాని చేతుల మీదుగా విడుదలైంది..

కన్నడ నాట సంచలన విజయం సాధించిన చిత్రం ‘కిరిక్ పార్టీ’.. ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టి ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే సినిమా  చేస్తున్నాడు. ‘లవ్ లీ’, ‘అడ్డా’, ‘రౌడీ’ సినిమాల్లో నటించిన శాన్వీ కథానాయిక.. పుష్కర్ ఫిలింస్ బ్యానర్‌పై మల్లిఖార్జునయ్య నిర్మిస్తుండగా, సచిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ పేరుతో రిలీజ్ కానుంది.

Image

తాజాగా ఈ సినిమా ట్రైలర్ నేచురల్ నాని చేతుల మీదుగా విడుదలైంది. రక్షిత్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఓ నిధి నేపథ్యంలో అడ్వెంచరస్‌గా తెరకెక్కుతుందీ చిత్రం.. ట్రైలర్‌‌లో సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటనేది చెప్పేశారు. విజువల్స్, ఆర్ఆర్, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఆకట్టుకునే కథా కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

Image

‘కేజీఎఫ్’ తర్వాత అంత భారీగా తెరకెక్కిన కన్నడ చిత్రం ఇదే కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో ‘అతడే శ్రీమన్నారాయణ’ విడుదల కానుంది. మ్యూజిక్ : అజనీష్ లోక్‌నాధ్, చరణ్ రాజ్, డీఓపీ : కర్మ్ చావ్లా, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి..