Athia Shetty-KL Rahul : ఒకటైన అతియా శెట్టి, కేఎల్ రాహుల్.. అతియా ఎమోషనల్ పోస్ట్!

బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నిన్న పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. నిన్న ముంబై ఖండాలా లోని ఫామ్‌హౌస్ జహాన్ లో వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. ఇక ఈ మధురమైన క్షణాన్ని వర్ణిస్తూ అతియా శెట్టి తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Athia Shetty-KL Rahul : ఒకటైన అతియా శెట్టి, కేఎల్ రాహుల్.. అతియా ఎమోషనల్ పోస్ట్!

Athia Shetty-KL Rahul

Athia Shetty-KL Rahul : బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నిన్న పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది అతియా. 2015లో ‘హీరో’ సినిమాతో ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు చిత్రాల్లో నటించింది. కాగా గత కొంత కాలంగా అతియా, కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం నడుపుతూ వచ్చింది. వీరిద్దరి పై బాలీవుడ్ మీడియాలో రోజుకో వార్త బయటకి వచ్చేది.

Athia Shetty-KL Rahul : అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం.. అతిథులు ఎంతమంది, వాళ్లకి రూల్స్ ఏంటో తెలుసా?

ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సునీల్ శెట్టి అనౌన్స్ చేయడంతో ఆ వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పడింది. నిన్న ముంబై ఖండాలా లోని ఫామ్‌హౌస్ జహాన్ లో వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. ఇక ఈ మధురమైన క్షణాన్ని వర్ణిస్తూ అతియా శెట్టి తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘నీ పరిచయంతో నేను ప్రేమించడం ఎలాగో నేర్చుకున్నాను. ఈరోజు మాకు అత్యంత ప్రియమైన వారి మధ్య మేము వివాహం చేసుకున్నాము. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు కావాలి’ అంటూ పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యుల నుంచి అత్యంత సన్నిహితమైన బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. మొత్తం మీద ఒక 100 మంది అతిథులు మాత్రమే హాజరయ్యినట్లు తెలుస్తుంది. మిగిలిన బంధు మిత్రులకు, సినీ ప్రముఖులకు, క్రికెటర్లు కోసం ప్రత్యేకంగా ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాడట సునీల్ శెట్టి. ప్రస్తుతం పెళ్లి కారణంగా కేఎల్ రాహుల్ న్యూజిలాండ్ సిరీస్ కి కూడా దూరమయ్యాడు. దీంతో మే నెలలో జరిగే ఐపీల్ ముగిసిన తరువాతే మిగిలిన వారందరి కోసం సునీల్ శెట్టి గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.