Atlee: తల్లిదండ్రులు కాబోతున్న తమిళ డైరెక్టర్ అట్లీ-ప్రియ దంపతులు

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ, ఆ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.

Atlee: తల్లిదండ్రులు కాబోతున్న తమిళ డైరెక్టర్ అట్లీ-ప్రియ దంపతులు

Atlee Announces His Wife Priya Pregnant

Atlee: తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ, ఆ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆ తరువాత వరుసగా తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు.

డైరెక్టర్ అట్లీపై కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్ట్

కాగా, అట్లీ భార్య ప్రియ గురించి కూడా కోలీవుడ్ ప్రేక్షకులు తెలిసిందే. ఆమె పెళ్లికి ముందే కొన్ని సీరియల్స్‌లో నటించింది. ఇక అట్లీని ప్రియ కొన్నాళ్లు ప్రేమించి, ఆపై ఇరువురి కుటుంసభ్యులు అంగీకారం మేరకు 2014లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా అట్లీ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి ఓ తీపి కబురును ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. తన భార్య గర్భవతిగా ఉందని.. త్వరలోనే తాము తల్లిదండ్రులము కాబోతున్నట్లు అట్లీ తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

‘‘మా కుటుంబం పెద్దది అవుతోంది. ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి’’ అంటూ ఎమోషనల్ పోస్ట్‌తో అట్లీ తన అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా అట్లీ-ప్రియ దంపతలు తల్లిదండ్రలు అవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.