Shalu Chaurasia : సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై దాడి.. సెల్ ఫోన్ లాకెళ్లిన దుండగులు

నిన్న రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్

Shalu Chaurasia :  సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై దాడి.. సెల్ ఫోన్ లాకెళ్లిన దుండగులు

Chaurasiya

Garima Chaurasia :  నిన్న రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో చౌరాసియాకి, ఆ వ్యక్తులకి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో చౌరాసియాకు గాయాలయ్యాయి. అయితే దుండగులు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు.

Akhanda : ట్రైలర్ లోనే ఇన్ని మాస్ డైలాగ్స్ ఉంటే.. సినిమాలో??.. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం

ఆ తర్వాత డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది ఈ సోషల్ మీడియా స్టార్. 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి సెల్ ఫోన్ లాకెళ్లారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. గాయపడిన ఆమెను సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు.