HotStar : హాట్‌స్టార్ ఆస్కార్ తో కూడా మెప్పించలేకపోయింది.. అసలే తగ్గుతున్న ఆదరణ.. ఇప్పుడేమో ఇలా..

ఇటీవల ఇండియాలో హాట్ స్టార్ కి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఆస్కార్ వేడుకలను ఫ్రీగానే లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఇలా అయినా ఆడియన్స్ హాట్ స్టార్ కి వస్తారనుకుంది. అయితే ఆస్కార్ వేడుకలను ఫ్రీగా టెలికాస్ట్ చేసినా..............

HotStar : హాట్‌స్టార్ ఆస్కార్ తో కూడా మెప్పించలేకపోయింది.. అసలే తగ్గుతున్న ఆదరణ.. ఇప్పుడేమో ఇలా..

Audience trolls on Hotstar regarding Oscar live streaming

HotStar :  ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా ముగిసింది. మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫాంట్ విష్పరర్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ ఆస్కార్ వేడుకలు అమెరికాలో, కొన్ని దేశాల్లో ABC న్యూస్ నుంచి లైవ్ ఇచ్చారు. మరి కొన్ని దేశాల్లో వేరే ప్లాట్ ఫార్మ్స్ లో లైవ్ ఇచ్చారు. అయితే ఇండియాలోమాత్రం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఆస్కార్ వేడుకలను లైవ్ స్ట్రీమ్ చేసింది. దీంతో పాటు మరో రెండు టీవీ ఛానల్స్ లైవ్ స్ట్రీమ్ ఇచ్చాయి. అయితే చాలా మంది డిస్నీప్లస్ హాట్‌స్టార్ లోనే చూశారు. ఇటీవల ఇండియాలో హాట్ స్టార్ కి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఆస్కార్ వేడుకలను ఫ్రీగానే లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఇలా అయినా ఆడియన్స్ హాట్ స్టార్ కి వస్తారనుకుంది. అయితే ఆస్కార్ వేడుకలను ఫ్రీగా టెలికాస్ట్ చేసినా మధ్యమధ్యలో చాలా యాడ్స్ ప్లే చేసింది. దీంతో వీక్షకులకు చిరాకు వచ్చింది. యాడ్స్ మధ్యలో ఆస్కార్ వేడుకలు చూశాం అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ పై విమర్శలు వస్తున్నాయి.

కరోనా సమయంలో, ఆ తర్వాత ఓటీటీలకు ఆదరణ పెరగడంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా ఇండియాలో పాపులర్ అయింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఇండియాలో ఎక్కువగా ఓ టీవీ ఛానల్ కంటెంట్, ఐపీఎల్ మ్యాచ్ లతోనే బాగా పాపులర్ అయింది. చాలామంది ఐపీఎల్ కోసమే దీని సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ హక్కులు వేరే సంస్థ చేజిక్కించుకోవడంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్ కి ఆదరణ తగ్గింది. దీంతో సబ్‌స్క్రయిబర్స్ కూడా తగ్గారు. అలాగే వేరే ఓటీటీలు అన్నీ కొత్త కొత్త కంటెంట్ ని నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకి తెస్తుంటే హాట్ స్టార్ మాత్రం కొత్త కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చెయ్యట్లేదు. దీనివల్ల కూడా హాట్ స్టార్ కి ఆదరణ తగ్గింది. ఇక డిస్నీప్లస్ హాట్‌స్టార్ కి ఎక్కువగా యాక్షన్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళు ఆడియన్స్ గా ఉన్నారు. హాలీవుడ్ HBO ఛానల్ సినిమాలు, సిరీస్ లు అన్నీ హాట్ స్టార్ లో వచ్చేవి. అయితే HBO, హాట్ స్టార్ ఒప్పందం మార్చ్ 31 తో ముగియనుంది. ఇప్పటికే కొన్ని HBO కంటెంట్స్ ని హాట్ స్టార్ నుంచి తీసేసారు. మార్చ్ 31 నుంచి పూర్తిగా తీసేయనున్నారు. దీంతో మరింత ఆదరణ తగ్గింది.

Rajyasabha : ఆస్కార్ సాధించిన RRR చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించిన రాజ్యసభ

ఆడియన్స్ తగ్గిపోతున్న సమయంలో ఇండియాలో ఆస్కార్ లైవ్ వేడుకలు స్ట్రీమ్ చేసి కొంతమందిని అయినా తనవైపు తిప్పుకోవాలనుకుంది. కానీ లైవ్ లో ఎక్కువగా యాడ్స్ ప్లే చేయడంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు ఉన్న ఆడియన్స్ కూడా హాట్ స్టార్ నుంచి జారుకుంటున్నారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో కంటెంట్ లేక, ఐపీఎల్ ఆఫర్ పోగొట్టుకొని, HBO ఒప్పందం వదులుకొని, ఇప్పుడేమో ఇలా ఆస్కార్ వేడుకల్లో ఎక్కువగా యాడ్స్ స్ట్రీమింగ్ చేసి.. మొత్తానికి ప్రేక్షకుల్లో బాగా నెగిటివిటి తెచ్చుకుంది. మరి ఇప్పటికైనా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుందా లేదా ఇలాగే వదిలేసి ఇండియాలో మార్కెట్ పోగొట్టుకుంటుందా చూడాలి.