Vikram: విక్రమ్ కోసం ఖైదీ వెంటపడుతున్న జనం!

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ బొమ్మగా నిలిచింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్....

Vikram: విక్రమ్ కోసం ఖైదీ వెంటపడుతున్న జనం!

Audiences Watching Again Khaidhi For Vikram

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ బొమ్మగా నిలిచింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దిన ఈ డైరెక్టర్ ట్యాలెంట్‌కు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే విక్రమ్ సినిమా చూసిన చాలా మంది ఈ సినిమాలోని పాత్రలు, వాటి నేపథ్యం గురించి తీవ్రంగ చర్చించుకుంటున్నారు.

Vikram: బాహుబలి2 రికార్డులకు ఎసరుపెట్టిన విక్రమ్..!

విక్రమ్ సినిమాలోని పాత్రలు, వాటి నేపథ్యం మనకు పూర్తిగా అర్థం కావాలంటే లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ సినిమాను తప్పకుండా చూడాల్సిందే అంటున్నారు. ఖైదీ సినిమా చూసిన వారికి విక్రమ్ సినిమా చాలా ఈజీగా అర్థం అవుతుందని పలువురు అంటున్నారు. ఆ సినిమాలోని కొన్ని సీన్స్, పాత్రలను విక్రమ్ సినిమాకు లింక్ అయ్యి ఉన్నాయని, అవి ఏమిటో తెలియాలంటే ఖైదీ చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు. దీంతో చాలా మంది ఆడియెన్స్, ఇప్పుడు మళ్లీ ఖైదీ సినిమాను చూస్తున్నారు.

Vikram: విక్రమ్ దెబ్బకు నిద్రలేచిన ఇండియన్!

గతంలో వచ్చిన ఖైదీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో కార్తీకి ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉందని తెలుసుకుని, ఈ సినిమాను పెద్ద ఎత్తున చూస్తున్నారు ఆడియెన్స్. దీంతో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు పెట్టినప్పటికంటే, ఇప్పుడు వ్యూయర్‌షిప్ డబుల్ అయ్యిందని డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఇలా విక్రమ్ సినిమాను పూర్తిగా అర్ధం చేసుకునేందుకు ప్రేక్షకులు ఖైదీ చిత్రం వెంట పడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.