Avanthi Srinivas : యాక్టింగ్ స్కూల్ పెట్టాలి.. వైజాగ్‌ని సినిమా హబ్‌గా మార్చడానికి టాలీవుడ్ ముందుకు రావాలి..

ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు చాలా పట్టుదలతో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని.......

Avanthi Srinivas : యాక్టింగ్ స్కూల్ పెట్టాలి.. వైజాగ్‌ని సినిమా హబ్‌గా మార్చడానికి టాలీవుడ్ ముందుకు రావాలి..

Avanthi

GHani Pre Release Event :  వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’. ఈ చిత్రం ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో నిన్న శనివారం ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ తో పాటు ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అతిధులుగా విచ్చేసారు. అభిమానులు కూడా భారీగా వచ్చారు.

 

‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ”ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్‌ ధరలను పెంచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఇండియాలోనే కలెక్షన్స్‌ వైజ్‌గా టాప్‌లో ఉంది. ఇండియాలో ఇటీవల రెండు బ్లాక్‌బస్టర్స్‌ మనవే. చిత్ర నిర్మాత అల్లు బాబీ తన తండ్రి అల్లు అరవింద్‌ లాగా గొప్ప నిర్మాత కావాలి. పదేళ్ల క్రితం వరుణ్‌ తేజ్‌ ఓ సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు స్టార్‌ హీరో అవుతాడని చెప్పాను, అయ్యాడు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని చెబుతున్నాను, అవుతాడు. ‘పుష్ప’ సినిమాతో బన్నీ ఇండియాను షేక్‌ చేశాడు’’ అని తెలిపారు.

Malaika Arora : రోడ్ యాక్సిడెంట్.. హాస్పిటల్‌లో బాలీవుడ్ హీరోయిన్

ఇక ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు చాలా పట్టుదలతో ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి అల్లు అరవింద్‌ మాస్టర్‌ లాంటి వారు. అల్లు రామలింగయ్యగారి పేరు మీద రాజమండ్రిలో హోమియోపతి మెడికల్‌ కాలేజీ పెట్టినట్లు వైజాగ్‌లో అల్లు రామలింగయ్యగారు, చిరంజీవిగారి పేర్లు కలిసి వచ్చేలా ఓ యాక్టింగ్‌ కాలేజీ పెట్టాలని నేను అరవింద్‌ గారిని కోరుతున్నాను. విశాఖపట్నం సినిమా హబ్‌ కావాలంటే అరవింద్‌ గారి లాంటి టాలీవుడ్ పెద్దలు ముందుకు రావాలి. వైజాగ్‌ సినిమా హబ్‌ అయితే లోకల్‌ టాలెంట్‌ చాలామంది వస్తారు. వైజాగ్‌లో ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రభుత్వం, ప్రజల సహకారం ఉంటుంది’’ అని అన్నారు.