Avatar 2: అవతార్-2 సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ వచ్చి దాదాపు 13 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సినిమాలోని విజువల్ వండర్, దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇక ఈ సినిమాకు జనం పట్టం కట్టడంతో, వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 మూవీని రిలీజ్‌కు రెడీ చేశాడు జేమ్స్ కామెరాన్.

Avatar 2: అవతార్-2 సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

Avatar 2: హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ వచ్చి దాదాపు 13 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సినిమాలోని విజువల్ వండర్, దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇక ఈ సినిమాకు జనం పట్టం కట్టడంతో, వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 మూవీని రిలీజ్‌కు రెడీ చేశాడు జేమ్స్ కామెరాన్.

Avatar 2 : లండన్‌ లో ప్రివ్యూ.. అవతార్ 2 ఫస్ట్ రివ్యూ ఇదే..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై మరోసారి అంచనాలను నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వరల్డ్‌వైడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుని రన్‌టైమ్‌ను లాక్ చేసుకుంది. అవతార్-2 సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చారు.

Avatar 2 : అవతార్ 2 ట్రైలర్ రిలీజ్.. స్టోరీ ఇదేనా..?

ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను ఏకంగా 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లుగా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఇంతటి లాంగ్ రన్‌టైమ్‌‌తో వస్తున్న అవతార్-2 సినిమాకు ఇది ఏమాత్రం ఎక్కువ కాదని.. ఇలాంటి సినిమాలకు ఎంతటి రన్‌టైమ్ ఉన్నా ఆడియెన్స్ సినిమాలో లీనమై చూస్తారని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి అవతార్-2 డిసెంబర్ 16న రిలీజ్ అవుతుండటంతో, ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Avatar 2 Completes Censor