Avatar 2: చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన విజువల్ వండర్!

హాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా తెరకెక్కిన అవతార్-2 కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. హాలీవుడ్‌లో తెరకెక్కిన అవతార్-2 మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు.

Avatar 2: చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన విజువల్ వండర్!

Avatar 2 Emerges As The Highest Grossing Hollywood Movie In India

Avatar 2: హాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా తెరకెక్కిన అవతార్-2 కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. హాలీవుడ్‌లో తెరకెక్కిన అవతార్-2 మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు.

Avatar 2: బిలియన్ డాలర్ మార్క్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న అవతార్ 2!

ఇక ఈ సినిమాకు ఇండియాలోనూ అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమా రిలీజ్ రోజునే కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టినట్లుగా చిత్ర వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు భారత్‌లో ఇంకా ప్రేక్షకాదరణ లభిస్తూనే ఉంది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా తనదైన సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అవతార్ 2 మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.368.20 కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది.

Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌తో దుమ్ములేపిన అవతార్-2

గతంలో హాలీవుడ్ సూపర్ హీరో మూవీ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రూ.367 కోట్ల వసూళ్లతో టాప్ స్థానంలో నిలవగా, ఇప్పుడు దాన్ని అవతార్-2 క్రాస్ చేసింది. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ టోటల్ రన్‌లో ఎంతమేర కలెక్షన్లు రాబడుతుందా అని ఇండియన్ మూవీ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా అవతార్-2 తన రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తుండటం విశేషమని చెప్పాలి.