Avatar 2: మరో మైల్‌స్టోన్ క్రాస్ చేసిన అవతార్-2.. ఏకంగా రెండు బిలియన్ డాలర్లు వసూలు!

హాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా వచ్చిన ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అవతార్-2 చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమా కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి.

Avatar 2: మరో మైల్‌స్టోన్ క్రాస్ చేసిన అవతార్-2.. ఏకంగా రెండు బిలియన్ డాలర్లు వసూలు!

Avatar 2: హాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా వచ్చిన ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అవతార్-2 చిత్రంలోని గ్రాఫిక్స్, సినిమా కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి.

Avatar 2: చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన విజువల్ వండర్!

అవతార్-2 సినిమా రిలీజ్ అయ్యి 38 రోజులు పూర్తయినా, థియేటర్లలో ఇంకా కలెక్షన్ల మోత మోగిస్తోంది ఈ మూవీ. ఈ క్రమంలోనే అవతార్-2 మూవీ ఓ అరుదైన ఫీట్‌ను సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి తన సత్తా చాటింది. అవతార్-2 ఈ ఫీట్ సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 6వ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా అవతార్-2 నిలిచింది.

Avatar 2 : అవతార్ మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్..

రానున్న రోజుల్లో ఈ సినిమా స్టార్ వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్, అవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్ చిత్రాలను దాటడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో అవతార్-2 సినిమా ప్రపంచంలో నాలుగో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. అవతార్-2 మూవీ మున్ముందుక ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.