Avatar 2: ఆన్‭లైన్‭లో అవతార్-2 ఫుల్ మూవీ.. విజువల్ వండర్‌కు పైరసీ ఎఫెక్ట్!

అవతార్ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాతో ప్రపంచ సినిమా మరో మైలు రాయి చేరుకున్నట్టైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ అవతార్ తుడిచి పెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే, హాలీవుడ్ సినీ పరిశ్రమను అవతార్‭కి ముందు అవతార్‭కి తర్వాత అని చెప్పుకుంటున్నారంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Avatar 2: ఆన్‭లైన్‭లో అవతార్-2 ఫుల్ మూవీ.. విజువల్ వండర్‌కు పైరసీ ఎఫెక్ట్!

Avatar 2 Full Movie Leaked Online For Free Download

Avatar 2: ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవతార్-2 సినిమా పైరసీ ఆన్‭లైన్‭లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు ముందే వైరసీ బయటికి రావడం గమనార్హం. రేపు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా పైరసీ వీడియో అప్పుడే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో, ఈ సినిమా డౌన్‭లోడ్ చేసుకుని చూడడమే కాకుండా, సినిమాపై తమ అభిప్రాయాలు సైతం వెల్లడిస్తున్నారు.

India-China Clash: చైనాతో రగడ నేపథ్యంలో అగ్ని-5 పరీక్షించిన భారత్.. ఇది ప్రయోగిస్తే చైనా ఇక అంతమే

అవతార్ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాతో ప్రపంచ సినిమా మరో మైలు రాయి చేరుకున్నట్టైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ అవతార్ తుడిచి పెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే, హాలీవుడ్ సినీ పరిశ్రమను అవతార్‭కి ముందు అవతార్‭కి తర్వాత అని చెప్పుకుంటున్నారంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అది విడుదలైన 13 ఏళ్లకు సీక్వెల్ విడుదల అవుతుండడం గమనార్హం. అప్పట్లో దర్శకుడు జేమ్స్ కామెరూన్‭ను సీక్వెల్ గురించి ప్రశ్నించగా.. తొందరలో తీస్తానని చెప్పి, మళ్లీ ఇన్నాళ్లకు అవతార్-2ని సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Himachal Pradesh: కేబినెట్ విస్తరణపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు