Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

వరల్డ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా అవతార్ 2. నెవర్ బిఫోర్ రికార్డ్స్ ను సెట్ చేసి పెట్టిన అవతార్ మళ్లీ రావడానికి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

Avatar 2

Avatar 2: వరల్డ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా అవతార్ 2. నెవర్ బిఫోర్ రికార్డ్స్ ను సెట్ చేసి పెట్టిన అవతార్ మళ్లీ రావడానికి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. అయితే దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న అవతార్ హీరో జేక్ ఈసారి తన భార్యా పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా థ్రిల్ చేయబోతున్నాడు.

KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

2009లో వచ్చిన వరల్డ్ ప్రీమియర్ అవతార్ సీక్వెల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. కొవిడ్ కారణంగా మళ్లీ వాయిదా పడిన అవతార్ 2 2022 డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ వన్ ఇయర్ గ్యాప్ లో నెమ్మదిగా హైప్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. రీసెంట్గా అవతార్ కపుల్ జేక్ సల్లీ, నేతిరి ఫ్యామిలీని పరిచయం చేసాడు అవతార్ ప్రొడ్యూసర్. అవతార్ 2లో నలుగురు పిల్లలున్న జంటగా హీరోహీరోయిన్లు కనిపిస్తారని చెప్తూ.. అందులోని ఒక పిల్లాడిని స్పైడర్ గా ఇంట్రడ్యూస్ చేసాడు.

2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!

హ్యూమన్ జాక్, న్యావి నేతిరి జంటకు జన్మించే పిల్లలు నేతియాం, తక్తిరే, లోక్ కాగా వీళ్లూ దత్తత తీసుకునే కొడుకుగా మైల్స్ సోర్కో.. స్పైడర్ కనిపించబోతున్నాడు. అవతార్ 2లో హీరోహీరోయిన్స్ తో పాటూ వాళ్ల పిల్లలకి క్రూషియల్ రోల్స్ ఉండేలా ప్లాన్ చేసాడు డైరెక్టర్ జేమ్స్ కామరూన్. ఈ మిక్స్ డ్ ఫ్యామిలీ కల్చర్ కి వాటర్ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేసి మెస్మరైజ్ చేయబోతున్నాడు కామరూన్. అండర్ వాటర్ లో అద్భుతాలను చూస్తారని ఇప్పటికే చాలాసార్లు హింట్ ఇచ్చారు. అండర్ వాటర్ సీన్స్ లో నటిస్తోన్న కేట్ విన్ స్లెట్ ఇప్పటికే ఆ ఇంటెన్స్ సీక్వెన్స్ గురించి చెప్పేసింది.

Ashu Reddy: ఆగని హాట్ పోజులు.. ఆపని ఫోటో షూట్లు!

అవతార్ కోసం పండోరా అనే కొత్త లోకాన్ని సృష్టించిన జేమ్స్ కామరూన్.. అవతార్ 2 కోసం అండర్ వాటర్ లోనే దాదాపు సినిమాను షూట్ చేసాడు. ఇప్పటికే పార్ట్ 2తో పాటు పార్ట్ 3 షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. అవతార్ తర్వాత మొత్తం నాలుగు భాగాలని తెరకెక్కిస్తోన్న మేకర్స్.. ప్రతీ పార్ట్ కి 1900 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం నాలుగు సీక్వెల్స్ కి 11300 కోట్ల బడ్జెట్. ఈ స్థాయిలో సీక్వెల్ సినిమాల కోసం ఖర్చు చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డ్.

New Film Releases: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. వర్రీ అవుతున్న హీరోలు!

వరుసగా రెండేళ్ల గ్యాప్‌తో ‘అవతార్ 3, 4, 5’ రిలీజ్ అవుతాయి. నిజానికి 2020 నుంచే ఈ లైనప్ స్టార్ట్ కావాల్సింది. కొవిడ్ కారణంగా వాయిదా పడిన అవతార్ 2.. వచ్చే ఏడాది డిసెంబర్ 16న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాత 2024, 26, 28 సంవత్సరాల్లో అదే డిసెంబర్ నెలల్లో ‘అవతార్’ సీక్వెల్స్ రిలీజ్ అవుతాయి. అవతార్’ 2009లో విడుదలైనప్పుడు రేగిన బాక్సాఫీస్ దుమారమే రాబోయే సంవత్సరాల్లో కనిపిస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అప్పట్లోనే ‘అవతార్’ వసూళ్లు 20 వేల 368 కోట్లు. ఇదే ఇప్పటి వరకూ వరల్డ్ మూవీ సాధించిన అతిపెద్ద రికార్డ్. మరి రికార్డ్ ను మళ్లీ అవతారే కొల్లగొడుతుందేమో చూడాలి.