Avatar 2: బాప్ రే.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్‌'. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Avatar 2: బాప్ రే.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!

Avatar 2: హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్‌’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాల ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచాయి.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

ఎన్నో అద్భుతాలు ఉన్న అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతున్న అవ‌తార్ 2 ఇదివ‌ర‌కెన్న‌డూ లేని వీఎఫ్ఎక్స్ తో ప్రేక్ష‌కులకు అద్బుత‌మైన అనుభూతిని క‌లిగించేలా ఉండ‌నుంద‌ట‌.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో విడుదల కాబోతుందట. అదే జరిగితే ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదే రికార్డ్ కానుంది. అలాగే ఈరోజు(బుధవారం) మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ని సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నారట. అలాగే హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయనున్నారట. దీంతో ఆడియెన్స్ ఇప్పుడు ఈ క్రేజీ గ్లిమ్ప్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.