‘అవతార్’ సీక్వెల్స్ అదిరిపోతాయంటున్న జేమ్స్ కామెరూన్.. షూటింగ్ ఎలా చేస్తున్నారంటే!..

  • Published By: sekhar ,Published On : September 13, 2020 / 06:25 PM IST
‘అవతార్’ సీక్వెల్స్ అదిరిపోతాయంటున్న జేమ్స్ కామెరూన్.. షూటింగ్ ఎలా చేస్తున్నారంటే!..

Avatar 2 set photos: ‘‘అవతార్’’.. వరల్డ్ సినిమా హిస్టరీలో జేమ్స్ కామెరూన్ చూపించిన అమేజింగ్ మూవీ. అస్సలు ఆలోచనకుకూడా అందని ప్రపంచం, ఊహించడానికి కూడా దూరంగా ఉన్న అద్భుతమైన సెట్స్, అదిరిపోయే యాక్షన్, అవాక్కయ్యే గ్రాఫిక్స్, ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచరస్ స్టంట్స్ అన్నీ కలిపితే ‘‘అవతార్’’. సంచలనం సృష్టించిన అవతార్ సీక్వెల్స్‌ను డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఎలా తెరకెక్కిస్తున్నారో తెలుసా.. ?


అవతార్ .. అదో విజువల్ వండర్. అంతకు ముందు వరకూ ఆడియెన్స్ చూడని గ్రాఫికల్ వరల్డ్. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ తో ఆడియన్స్ కి అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో మనుషుల కన్నా ఎత్తుగా విచిత్రంగా ఉన్న పండోరా వాసుల్ని, పండోరా దీవుల్ని పరిచయం చేశారు కామెరూన్. దాదాపు 17వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 2009 లో రిలీజ్ అయిన అవతార్ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 2 లక్షల కోట్లు కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ క్రియేట్ చేసింది.


2009 లో వచ్చిన అవతార్ సినిమాకి 10 సంవత్సరాల తర్వాత సీక్వెల్ స్టార్ట్ చేశారు జేమ్స్ కామెరూన్. అసలు ఫస్ట్ సినిమాలోనే అద్బుతమైన విజువల్స్ తో పాటు..అసలు ఊహకు కూడా అందని గ్రాఫిక్స్ ని చూపించిన జేమ్స్..లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పిక్స్ తో అవతార్ సీక్వెల్స్ లో అంతకుమించి విజువల్ వండర్స్ ఉంటాయని హింట్ ఇచ్చి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ని ఇంకా పెంచేశారు . అంతేకాదు..ఈ సినిమాలని ఎలా తెరకెక్కిస్తున్నారో, ఎంత టెక్నికల్ సపోర్ట్ ని యూజ్ చేస్తున్నారో లేటెస్ట్ గా పిక్స్ రిలీజ్ చేశారు అవతార్ టీమ్.


అవతార్ లో చూపించిన అద్బుతమైన పండోరా ని ఈ అవతార్ 2, 3 లో కంప్లీట్ గా కొత్తగా చూస్తారని అవతార్ అఫీషియల్ వెబ్ సైట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు అవతార్ 2 ని అండర్ వాటర్ లో డైరెక్ట్ చేస్తూ..చూపిస్తున్న కామెరూన్ ఫోటోస్ ని రిలీజ్ చేసింది టీమ్. అవతార్ సీక్వెల్స్ లో జస్ట్ పండోరాని చూడడమే కాదు..ప్రపంచం మొత్తం చూస్తారని చెబుతున్నారు డైరెక్టర్ జేమ్స్. అవతార్ సినిమాలో నటించిన యాక్టర్స్ తో పాటు కేట్ విన్ స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రెన్ డన్ కవెల్ లాంటి టాప్ స్టార్స్ ఈసీక్వెల్స్ లో నటిస్తున్నారు.


నిజానికి అవతార్ 2 ని 2021 డిసెంబర్ 17 న రిలీజ్ చేద్దామని డేట్ అనౌన్స్ చేశారు. కానీ అది ఇంకో సంవత్సరం పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 16, 2022 కి రిలీజ్ అవబోతోంది. ఇక అవతార్ 3 డిసెంబర్ 20, 2024 లో రిలీజ్ అవనుంది. అలాగే అవతార్ 4 ని డిసెంబర్ 18, 2026 న రిలీజ్ చేయనున్నారు. లాస్ట్ ..అవతార్ 5 డిసెంబర్ 22, 2028 లో రిలీజ్ చేస్తున్నట్టు డేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్..